Sanju Samson : అందుకే రాజస్తాన్‌ రాయల్స్‌ను వీడాను.. సంజూ శాంసన్ పోస్ట్.. తొలి నాళ్ల‌లోని ఫోటో షేర్ చేసి..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను వీడి చెన్నై సూప‌ర్ కింగ్స్ ను చేరిన త‌రువాత సంజూ శాంస‌న్ (Sanju Samson)తొలిసారి స్పందించాడు.

Sanju Samson : అందుకే రాజస్తాన్‌ రాయల్స్‌ను వీడాను.. సంజూ శాంసన్ పోస్ట్.. తొలి నాళ్ల‌లోని ఫోటో షేర్ చేసి..

Sanju Samson first comments after joining Chennai super kings from Rajasthan Royals

Updated On : November 15, 2025 / 5:46 PM IST

Sanju Samson : ఐపీఎల్ 2026 వేలాని క‌న్నా ముందే ట్రేడ్ డీల్స్ పూర్తి అయ్యాయి. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో సంజూ శాంస‌న్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. అత‌డిని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నుంచి ట్రేడింగ్‌లో సీఎస్‌కే తీసుకుంది. బ‌దులుగా ఆల్‌రౌండ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, సామ్ క‌ర్ర‌న్‌ల‌ను ఆర్ఆర్‌కు ఇచ్చింది.

సంజూ శాంస‌న్ ప్ర‌స్తుత ఫీజు రూ.18 కోట్ల మొత్తాన్నే చెన్నై చెల్లించ‌నుంది. అయితే.. జ‌డేజా మాత్రం ప్ర‌స్తుత ఫీజు కంటే నాలుగు కోట్ల త‌క్కువ మొత్తానికే అంటే రూ.14 కోట్ల‌కే ఆర్ఆర్‌కు వెళ్లాడు. ఇక సామ్ క‌ర్ర‌న్ ప్ర‌స్తుత ఫీజు రూ.2.4 కోట్ల‌నే అందుకోనున్నాడు.

IND vs SA : విజృంభించిన జ‌డేజా.. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ద‌క్షిణాఫ్రికా.. ముగిసిన రెండో రోజు ఆట‌

ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను వీడిన త‌రువాత సంజూ శాంస‌న్ తొలి సారి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. స‌మ‌యం వ‌చ్చింది గ‌నుక‌నే తాను జ‌ట్టును వీడానంటూ అత‌డు రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

‘మ‌నం ఇక్క‌డ కొద్ది కాల‌మే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా స‌ర్వ‌స్వం ధార‌పోశాను. ఆట‌ను ఎంతో ఆస్వాదించాను. జీవితానికి స‌రిప‌డా జ్ఞాప‌కాల‌ను పోగుచేసుకున్నాను. ఇక ప్రాంఛైజీలోని ప్ర‌తి ఒక్క‌రిని నా కుటుంబ స‌భ్యుడిగానే భావించాను. అయితే.. ఇప్పుడు స‌మ‌యం వ‌చ్చింది. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందుకే జ‌ట్టును వీడాను. ఇక్క‌డ నాకు ల‌భించిన ప్ర‌తి దానికి నేను ఎల్ల‌ప్పుడూ కృత‌జ్ఞ‌త‌తో ఉంటాను.’ అని సంజూ శాంస‌న్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా రాయల్స్‌తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను అత‌డు షేర్ చేశాడు.

Mohammed Shami : స‌న్‌రైజ‌ర్స్ నుంచి ల‌క్నోకు ష‌మీ.. రూ.10 కోట్లకు.. ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ఏమ‌న్నాడో తెలుసా?

2013లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో చేరాడు సంజూ శాంస‌న్‌. కొన్నాళ్ల పాటు ఆ జ‌ట్టులో కొన‌సాగాడు. ఆ త‌రువాత 2016 లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మారాడు. రెండేళ్ల పాటు ఇదే జ‌ట్టులో ఉన్నాడు. ఆ త‌రువాత మ‌ళ్లీ 2018లో ఆర్ఆర్ గూటికే చేరాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగాడు. ఇక కెప్టెన్‌గా ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Sanju V Samson (@imsanjusamson)

మొత్తంగా 67 మ్యాచ్‌ల్లో రాజ‌స్థాన్‌కు కెప్టెన్‌గా సంజూ శాంస‌న్ వ్య‌వ‌హ‌రించాడు.