Suresh Raina : సురేష్ రైనా వ్యాయామం వీడియో చూశారా.. ఇలాచేస్తే ఫుల్ ఫిట్‌నెస్ అట.. ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత సురేష్ రైనా రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.

Suresh Raina : సురేష్ రైనా వ్యాయామం వీడియో చూశారా.. ఇలాచేస్తే ఫుల్ ఫిట్‌నెస్ అట.. ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్

Suresh Raina

Updated On : August 2, 2023 / 12:46 PM IST

Suresh Raina Video : భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సురేష్ రైనా క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా బరిలోకిదిగి పరుగుల వరద పారించడం రైనా స్పెషాలిటీ. రైనా క్రీజులో కొద్దిసేపు కుదురుకున్నాడంటే సిక్సులు, ఫోర్ల మోతమోగాల్సిందే. 205 ఐపీఎల్ మ్యాచ్‌లలో రైనా 32.52 సగటుతో 5,528 పరుగులు చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో రైనా కీలక ఆటగాడు. 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లలో టీమిండియా తరపున ఆడాడు. రైనా పేరుతో టీమిండియా క్రికెట్‌లో అనేక రికార్డులు ఉన్నాయి. అయితే, 2022 సెప్టెంబర్ 6న రైనా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విధితమే.

Suresh Raina : నెట్స్‌లో కఠిన బౌలర్ అత‌డే.. ఔటైయ్యామా.. నెల‌రోజులు అత‌డి ప‌క్క‌న కూర్చోలేం

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత రైనా రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్‌లో వివిధ భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఆమ్‌స్టర్‌డామ్‌లో తన వ్యాపార కార్యకలాపాల్లో మునిగిపోయిన రైనా ఇటీవల స్వస్థలానికి వచ్చాడు. తరచూ జిమ్‌లో వ్యాయామం చేస్తూ కనిపించే రైనా.. జిమ్ వదిలి తన ఇంటి మేడపై వ్యాయామం చేశాడు. భారతీయ పద్దతుల్లో వ్యాయామం చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Suresh Raina : రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టిన చిన్న త‌లా.. యూర‌ప్ న‌డిబొడ్డున.. స్వ‌యంగా వంట చేసిన రైనా

ఈ వీడియోకు క్యాప్షన్‌గా.. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి దేశీ- మోడ్‌కి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. గ్రైండ్‌ని కొట్టి, వారాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించడం అని రాశాడు. ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది వీక్షకులు వీడియోను సందర్శించారు. పలువురు రైనాను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మాజీ భారత క్రికెటర్ ఎస్ఎన్ శ్రీశాంత్ స్పందించారు. బ్రదర్ గొప్పగా కనిపిస్తున్నావు. త్వరలో కలుద్దాం సోదరా అంటూ పేర్కొన్నాడు. స్పందించిన రైనా.. ధన్యవాదాలు గోవిందా.. త్వరలో కలుద్దాం అంటూ సమాధానం ఇచ్చాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Suresh Raina (@sureshraina3)