IND vs PAK : ఆదివారం పాక్‌తో మ్యాచ్ పై ప్ర‌శ్న‌.. నాలుగు ప‌దాల‌తో సూర్య స‌మాధానం.. పేరును ప్ర‌స్తావించ‌కుండానే..

ఆసియాక‌ప్ 2025 సూప‌ర్‌4లో భాగంగా ఆదివారం భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ (IND vs PAK) జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ పై సూర్య‌కుమార్ యాద‌వ్ కి ప్ర‌శ్న ఎదురైంది.

IND vs PAK : ఆదివారం పాక్‌తో మ్యాచ్ పై  ప్ర‌శ్న‌.. నాలుగు ప‌దాల‌తో సూర్య స‌మాధానం.. పేరును ప్ర‌స్తావించ‌కుండానే..

Suryakumar Yadav Four Word Reply Ahead Of India Super 4 Clash Vs Pakistan

Updated On : September 20, 2025 / 10:49 AM IST

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. గ్రూప్ స్టేజీలో చివ‌రి లీగ్ మ్యాచ్‌లో శుక్ర‌వారం ఒమ‌న్‌తో త‌ల‌ప‌డిన భార‌త్ 21 ప‌రుగుల తేడాతో గొలుపొందింది. దీంతో గ్రూప్‌-ఏలో అగ్ర‌స్థానంతో భార‌త్ సూప‌ర్‌-4లో అడుగుపెడుతోంది.

ఇక సూప‌ర్‌-4లో భాగంగా భార‌త్ ఆదివారం చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. కాగా.. ఒమ‌న్‌తో మ్యాచ్ అనంత‌రం జ‌రిగిన ప్రెజెంటేష‌న్ కార్య‌క్ర‌మంలో పాక్‌తో మ్యాచ్‌కు సంబంధించిన ప్ర‌శ్న టీమ్ఇండియా కెప్టెన్‌ సూర్య‌కుమార్ యాద‌వ్‌కు ఎదురైంది. ఈ క్ర‌మంలో సూర్య పాక్ పేరును ప్ర‌స్తావించ‌కుండానే స‌మాధానం చెప్పాడు.

IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. గాయ‌ప‌డిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..!

ఈ మెగాటోర్నీ గ్రూప్ స్టేజీలో భాగంగా సెప్టెంబ‌ర్ 14న భార‌త్, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. నాటి మ్యాచ్‌లో టాస్ సంద‌ర్భంగా, మ్యాచ్ పూర్తైన త‌రువాత గానీ టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో పాటు భార‌త ఆట‌గాళ్లు పాక్ ప్లేయ‌ర్ల‌తో క‌ర‌చాల‌నం చేయ‌లేదు. దీన్ని పాక్ ఆట‌గాళ్లు అవ‌మానంగా భావించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆ మ్యాచ్ త‌రువాత జ‌రిగిన ప్రెజెంటేష‌న్ కార్య‌క్రమంలో పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అఘా పాల్గొనలేదు.

ఆ త‌రువాత మ్యాచ్ రిఫ‌రీ ఆండీ పైక్రాఫ్ట్ ఇందుకు బాధ్యుడిగా పేర్కొంటూ పీసీబీ అత‌డిని రిఫ‌రీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని ఐసీసీని డిమాండ్ చేసింది.  ఇందుకు ఐసీసీ తిర‌స్క‌రించింది. ఈ క్ర‌మంలో యూఏఈతో మ్యాచ్ ముందు పాక్ హైడ్రామా చేసింది. దీంతో గంట ఆల‌స్యంగా మ్యాచ్ ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే.

Suryakumar Yadav : ఒమ‌న్ పై క‌ష్టంగా గెలిచిన భార‌త్‌.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఏమ‌న్నాడంటే?

ఇక ఇప్పుడు రెండో సారి ఆదివారం భార‌త్, పాక్ త‌ల‌ప‌డ‌నున్న నేప‌థ్యంలో కామెంటేట‌ర్ మంజేక్ర‌ర్.. ఒమ‌న్‌తో మ్యాచ్ ముగిసిన త‌రువాత సూర్య‌తో మాట్లాడాడు. ఆదివారం పాక్‌తో మ్యాచ్‌కు అంతా సిద్ధం అయ్యారా? అని అడుగగా.. సూర్య పాక్ పేరును ప్ర‌స్తావించ‌కుండా సూప‌ర్ 4 పోరుకి అంతా సిధ్ధంగా ఉన్నామ‌ని చెప్పుకొచ్చాడు.