Paris Olympics 2024 : షూటింగ్‌లో స్వప్నిల్‌కు కాంస్యం.. మూడుకు చేరిన భారత పతకాల సంఖ్య
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది.

Swapnil Kusale wins bronze medal in mens 50m rifle 3P shooting
Swapnil Kusale wins bronze medal : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. యువ షూటర్ స్వప్నిల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్‌లో స్వప్నిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
గురువారం జరిగిన ఫైనల్‌లో ఆరంభంలో స్వప్నిల్ కాస్త నెమ్మదించాడు. ఓ దశలో అతడు నాలుగు, ఐదు స్థానాల మధ్య కొనసాగాడు. ఆఖరికి 451.4 పాయింట్లతో మూడో స్థానంతో ముగించాడు. చైనాకు చెందిన లి యుకున్ 463.6 పాయింట్లతో స్వర్ణం గెలవగా, ఉక్రెయిన్‌కు చెందిన కులిష్ సెర్హియ్ 461.3 పాయింట్లతో రజతం సొంతం చేసుకున్నాడు.
టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్ వీడియో వైరల్.. గంభీర్, కోహ్లీ ఏం చేశారో చూడండి..
స్వప్నిల్ కాంస్యం గెలవడంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ – మను భాకర్ లు కాంస్య పతకాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
??? ?????’? ????? ????????! A historic achievement for Swapnil Kusale as he wins India’s first-ever medal in the 50m Rifle 3 Positions shooting event at the Olympics.
? Here’s a look at India’s shooting medallists in the Olympics over the years.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 1, 2024