T20 World Cup 2021 : వరల్డ్ కప్‌ను విజయంతో ముగించిన టీమిండియా
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో నమీబియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచింది. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. నమీబియా నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్ ను కేవలం ఒక వికెట్..

T20 World Cup 2021 India Beats Namibia
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో నమీబియాతో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ లో భారత్ గెలిచింది. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. నమీబియా నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప టార్గెట్ ను కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో చేజ్ చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ(37 బంతుల్లో 56), కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 54) హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 25 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో జాన్ ఒక వికెట్ తీశాడు.
నమీబియాతో మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. జడేజా, అశ్విన్, బుమ్రా ధాటికి నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. జడేజా 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, అశ్విన్ 20 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.
KCR : త్వరలో 70వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
ఈ పోరులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. నమీబియా ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21), మైకేల్ వాన్ లింగెన్ (14) ఓ మోస్తరు ప్రదర్శన చేయగా, ఆల్ రౌండర్ డేవిడ్ వీజ్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్ ఎరాస్మస్‌తో కలిసి వీజ్ ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో నమీబియా ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది.
FB Own Survey : ఫేస్‌బుక్‌తో 36 కోట్ల మందికి రిస్క్!
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశ నేటితో ముగిసింది. చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా, నమీబియా తలపడ్డాయి. టీమిండియాకు టీ20 ఫార్మాట్ లోనూ కెప్టెన్ గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నానని, తన వరకు అత్యుత్తమ సేవలు అందించానని కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. రోహిత్ శర్మకు ఎలాగూ నాయకత్వ అనుభవం ఉందని, ఈ పొట్టి క్రికెట్ లోనూ భారత జట్టు బాధ్యతలు మెరుగైన వ్యక్తి చేతుల్లోనే ఉంటాయని భావిస్తున్నానని చెప్పాడు.
ఈ టోర్నీతో కోహ్లీ టీ20 ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు. కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో, టీ20 ఫార్మాట్ లో భారత జట్టు తదుపరి కెప్టెన్ రోహిత్ శర్మేనని అర్థమవుతోంది.
గ్రూప్-2లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్… ఆపై వరుసగా అఫ్ఘానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై ఘన విజయాలు నమోదు చేసింది. అయితే సమీకరణాలు సహకరించకపోవడంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాగా, టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్.
ఇక, టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ దశకు తెరలేచింది. నవంబర్ 10న జరిగే తొలి సెమీస్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 11న జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.