T20 World Cup 2021: చెలరేగిన రాహుల్, ఇషాన్.. ఏడు వికెట్లతో ఇంగ్లాండ్‌పై విజయం

టీ20 వరల్డ్ కప్ 2021కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

T20 World Cup 2021: చెలరేగిన రాహుల్, ఇషాన్.. ఏడు వికెట్లతో ఇంగ్లాండ్‌పై విజయం

T20 World Cup 2021

Updated On : October 19, 2021 / 6:58 AM IST

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. కేఎల్ రాహుల్ విజృంభించి 24బంతుల్లో ఆరు బౌండరీలు, 3సిక్సులు 51పరుగులు బాదాడు. కిషన్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగినా మూడు సిక్సులు, ఏడు బౌండరీలు కలిపి 46బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ సెట్ చేసిన 189పరుగుల లక్ష్యాన్ని 19ఓవర్లలోనే 3వికెట్లు కోల్పోయి సాధించగలిగింది.

ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో విల్లీ బౌలింగ్ లో తొలి బౌండరీ సాధించిన రాహుల్.. నాలుగో ఓవర్ల మూడు ఫోర్లు, సిక్స్ దంచేశాడు. వెంటనే వుడ్ బౌలింగ్ లో ఇషాన్ రెండు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత జోర్డాన్, అలీ బౌలింగ్ లో సిక్స్ లు బాది 9వ ఓవర్లు 82స్కోరు వద్ద వెనుదిరిగాడు.

12వ ఓవర్ల నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి 2 సిక్సులు, 2ఫోర్లు కొట్టాడు. కోహ్లీ(11) త్వరగానే నిష్క్రమించినా.. పంత్ రావడంతోనే దాడి మొదలుపెట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (8), హార్దిక్ (12 నాటౌట్)తో చేతుల మీదుగా మ్యాచ్ ముగిసింది.

……………………………………………….. : ఆగని హింస.. హిందువుల ఇళ్లకు నిప్పు, 66 ఇళ్లు ధ్వంసం

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో 188పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్ స్టో (49), మొయిన్ అలీ (43), లివింగ్ స్టోన్ (30) స్కోరు నమోదు చేశారు. షమీ 3, బుమ్రా.. రాహుల్ చాహర్ లు చెరో వికెట్ తీయగలిగారు.