IND vs SA: టీ20 వరల్డ్ కప్‌ విజేత భారత్.. పోరాడి ఓడిన సౌతాఫ్రికా!

IND vs SA: టీ20 ప్రపంచ కప్‌‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.

IND vs SA: టీ20 వరల్డ్ కప్‌ విజేత భారత్.. పోరాడి ఓడిన సౌతాఫ్రికా!

PIC Credit : @BCCI twitter

IND vs SA: టీ20 ప్రపంచ కప్‌‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ ఉత్కంఠ పోరులో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను రోహిత్ సేన సొంతం చేసుకుంది. 17ఏళ్ల తర్వాత మరోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకే ఓటమి పాలైంది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో విఫలమైంది.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెస్ (52) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, క్వింటన్ డికాక్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31), డేవిడ్ మిల్లర్ (21) రాణించారు. మిగతా ఆటగాళ్లలో రీజా హెండ్రిక్స్ (4), కెప్టెన్ ఐడెన్ మార్ర్కామ్ (4), మార్కో జాన్సెన్ (2), రబడా (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కేశవ్ మహారాజ్ (2), అన్రిచ్ (1)తో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.

సౌతాఫ్రికా టార్గెట్ 177 పరుగులు
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో రాణించడంతో సౌతాఫ్రికా ముందు టీమిండియా 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియాలో రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లీ 76, రిషబ్ పంత్ 0, సూర్యకుమార్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 47, శివం దుబే 27, హార్దిక్ పాండ్యా 5(నాటౌట్), రవీంద్ర జడేజా 2 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 176 పరుగులు చేసింది.

అక్షర్ హాఫ్ సెంచరీ మిస్
అక్షర్ హాఫ్ సెంచరీ మిస్ అయింది. 31 బంతుల్లో 47 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. టీమిండియా స్కోరు 14 ఓవర్లకు 108గా ఉంది.

రోహిత్, రిషబ్ ఔట్
ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. రోహిత్ శర్మ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు.

దక్షిణాఫ్రికా తుది జ‌ట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీప‌ర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

టాస్‌..
ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవ‌న్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డులు..
ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు 26 టీ20 మ్యాచుల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో భార‌త్ 14 మ్యాచుల్లో, ద‌క్షిణాఫ్రికా 11 మ్యాచుల్లో గెలిచింది. మ‌రో మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు.

నో రెయిన్‌..
బార్బ‌డోస్‌లో ప్ర‌స్తుతం మెరుగైన వాతావ‌ర‌ణ‌మే ఉంది. వ‌రుణుడు జాడ అయితే లేదు. అయితే.. మ్యాచ్ మొద‌లైన త‌రువాత వ‌ర్షం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని అక్యూ వెద‌ర్ తెలిపింది.

IND vs SA : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆఖ‌రి స‌మ‌రానికి అంతా సిద్ధ‌మైంది. బార్బ‌డోస్ వేదిక‌గా మ‌రికాసేప‌ట్లో టీమ్ఇండియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డనున్నాయి. 2007లో తొలి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టు మ‌రోసారి క‌ప్పును ముద్దాడ‌లేదు. ఇన్నాళ్ల నిరీక్ష‌ణ‌ల‌కు తెర‌దించుతూ నేటి ఫైన‌ల్‌లో గెలిచి మ‌రోసారి టీ20 ఛాంపియ‌న్లుగా నిల‌వాల‌ని స‌గ‌టు భార‌త అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రోవైపు ఏ ఫార్మాట్‌లోనైనా స‌రే ద‌క్షిణాఫ్రికా ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇదే తొలిసారి. దీంతో ఈ ఫైన‌ల్‌లో గెలిచి తొలిసారి విశ్వ‌విజేత‌లుగా నిల‌వాల‌ని దక్షిణాఫ్రికా ప‌ట్టుద‌ల‌గా ఉంది.