T20 World Cup 2024 : భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ఇంత చెత్త మైదానంలో జరుగుతుందా? వీడియోలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే ..

భారత్ జట్టు తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. రెండో మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్ తో తలపడుతుంది.

T20 World Cup 2024 : భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ఇంత చెత్త మైదానంలో జరుగుతుందా? వీడియోలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే ..

T20 World Cup 2024

Updated On : January 16, 2024 / 9:09 AM IST

India vs Pakistan Match Ground: ఈ ఏడాది జూన్ నెలలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 1 నుంచి జూన్29వ తేదీ వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి వెస్టిండీస్, అమెరికా ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. సూపర్ -8 దశలో రెండు గ్రూపుల్లోని మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైన్ లోకి ప్రవేశిస్తాయి.. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ ల ద్వారా రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. అమెరికాలో మూడు, వెస్టిండీస్ లో ఆరు వేదికల్లో మొత్తం 55 మ్యాచ్ లు జరగనున్నాయి. గత టీ20 ప్రపంచ కప్ లో మొత్తం 16 జట్లు పాల్గొనగా.. ఇప్పుడు 20 జట్లు పాల్గొంటున్నాయి.

Also Read : Sikandar Raza : టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ అరుదైన ఘ‌న‌త‌.. దిగ్గ‌జ‌ ఆట‌గాళ్ల వ‌ల్లే కాలే..!

భారత్ జట్టు తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. రెండో మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్ తో తలపడనుంది. మూడో మ్యాచ్ జూన్ 12న అమెరికాతో జరగనుంది. ఈ మూడు మ్యాచ్ లు న్యూయార్క్ లోనే జరగనున్నాయి. న్యూయార్క్ లోని ఐసెన్‌హోవర్ పార్క్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఇటీవల ఈ మైదానంకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ స్టేడియం ఇంకా సిద్ధంగా లేదని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మైదానంలో స్టాండ్, ప్లడ్ లైట్లు గానీ కనిపించవు. మైదానంలో కొందరు క్రికెట్ ఆడుతున్నారు. అయితే, ఈ వీడియోలు నిజంగా భారత్ – పాక్ జట్లు తలపడే మ్యాచ్ కు సంబంధించిన మైదానానివేనా అనే విషయంపై పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. ఫొటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి.

Also Read : Virtat Kohli : కోహ్లీ ఖాతాలో మ‌రో ప్ర‌పంచ రికార్డు.. ఏంటో తెలుసా..?

ఈ వీడియోలను చూసిన పలువురు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిచ్, అవుట్ ఫీల్డ్ చాలా అధ్వాన్నంగా కనిపిస్తుంది.. ఈ మైదానంలోనా.. ఇండియా – పాక్ మ్యాచ్ జరిగేది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేయగా.. సోదరా.. నా గ్రామంలోని మైదానం ఇంతకంటే మెరుగ్గా ఉంటుంది అంటూ మరొకరు కామెంట్ చేశారు

 

 

 

భారత్ జట్టు షెడ్యూల్ ఇలా..

  • జూన్ 5న భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్)
  • జూన్ 9న భారత్ వర్సెస్ పాకిస్థాన్ (న్యూయార్క్)
  • జూన్ 12న భారత్ వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్)
  • జూన్ 15న భారత్ వర్సెస్ కెనడా (ప్లోరిడా)
  • జూన్ 19 నుంచి జూన్ 24 వరకు సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతాయి.
  • జూన్ 26న తొలి సెమీ ఫైనల్ (గయానా)
  • జూన్ 28న రెండో సెమీ ఫైనల్ ( ట్రినిడాడ్)
  • జూన్ 29న ఫైనల్ మ్యాచ్ (బార్బడోస్)