IND vs USA : టీ20 ప్రపంచ కప్.. అమెరికాపై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

PIC Credit : BCCI/ Twitter
IND vs USA : టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ ఈరోజు (జూన్ 12) అమెరికాతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే 18.2 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి ఛేదించింది. మూడో మ్యాచ్‌లో విజయంతో రోహిత్ సేన సూపర్-8కి చేరుకుంది.
భారత్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పరుగులేమి చేయకుండానే ఆదిలోనే నిష్ర్కమించాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (3) చేతులేత్తేశాడు. 2 ఓవర్లలోనే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (18) పరుగులతో పర్వాలేదనిపించాడు.
?? emerge victorious in New York! ?
A clinical performance as India secure their qualification to Second Round of the #T20WorldCup 2024 ?#USAvIND | ?: https://t.co/f5Kt1mVW4Z pic.twitter.com/jMrYtMnYYQ
— T20 World Cup (@T20WorldCup) June 12, 2024
సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్; 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీ, శివవ్ ధూబె (31) పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరూ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రవల్కర్ 2 వికెట్లు పడగొట్టగా, అలీ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. అమెరికా పతనాన్ని శాసించిన అర్ష్‌దీప్ సింగ్ (4 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Career-best figures earns Arshdeep Singh the @aramco POTM award ?#USAvIND #T20WorldCup pic.twitter.com/dBdqdkWZ0A
— T20 World Cup (@T20WorldCup) June 12, 2024
యూఎస్ఏకు 5 పరుగుల పెనాల్టీ :
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికాకు ఐదు పరుగుల పెనాల్టీ పడింది. భారత్ ఇన్నింగ్స్ సమయంలో కొత్త ఓవర్ వేసేందుకు యూఎస్ఏ 60 సెకన్ల పాటు సమయం తీసుకుంది. నిబంధనల ప్రకారం.. యూఎస్ఏకు 5 పరుగుల పెనాల్టీని విధించారు. 16 ఓవర్ ప్రారంభంలో ఈ 5 పరుగులు భారత్ జట్టు ఖాతాలో కలిశాయి.
టీమ్ఇండియా టార్గెట్ 111
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అమెరికా బ్యాటర్లలో నితీశ్ కుమార్ (27), స్టీవెన్ టేలర్ (24), కోరె అండర్సన్ (14) లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.
హర్మీత్ సింగ్ ఔట్..
అమెరికా మరో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ క్యాచ్ అందుకోవడంతో హర్మీత్ సింగ్(10) ఔట్ అయ్యాడు. దీంతో 17.3వ ఓవర్‌లో 98 పరుగుల వద్ద అమెరికా ఏడో వికెట్ కోల్పోయింది.
2⃣ wickets in space of 2 overs! ?
A wicket each for Hardik Pandya & Arshdeep Singh! ?#TeamIndia making merry & how!
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y #T20WorldCup | #USAvIND pic.twitter.com/ZYml41A7eh
— BCCI (@BCCI) June 12, 2024
కోరె అండర్సన్ ఔట్..
అమెరికా మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రిషబ్ పంత్ క్యాచ్ అందుకోవడంతో కోరె అండర్సన్ (14) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 16.5వ ఓవర్‌లో 96 పరుగుల వద్ద అమెరికా ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లకు అమెరికా స్కోరు 96/6. హర్మీత్ సింగ్ (9), షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (0) లు క్రీజులో ఉన్నారు.
నితీశ్ కుమార్ ఔట్..
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సిరాజ్ క్యాచ్ అందుకోవడంతో నితీశ్ కుమార్ (27) ఔట్ అయ్యాడు. దీంతో 14.4 ఓవర్‌లో 81 పరుగుల వద్ద అమెరికా ఐదో వికెట్ కోల్పోయింది.
టేలర్ క్లీన్‌బౌల్డ్..
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టీవెన్ టేలర్(24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 11.4వ ఓవర్‌లో 56 పరుగుల వద్ద అమెరికా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు అమెరికా స్కోరు 59/4. నితీశ్ కుమార్ (14), కోరె అండర్సన్ (1) లు క్రీజులో ఉన్నారు.
Axar Patel ? Wicket
4⃣th success with the ball for #TeamIndia! ? ?
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #USAvIND
? ICC pic.twitter.com/f5LmhRXjJj
— BCCI (@BCCI) June 12, 2024
ఆరోన్ జోన్స్ ఔట్..
అమెరికా మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ క్యాచ్ అందుకోవడంతో ఆరోన్ జోన్స్ (11) ఔట్ అయ్యాడు. దీంతో 7.2వ ఓవర్‌లో 25 పరుగుల వద్ద అమెరికా మూడో వికెట్ కోల్పోయింది.
Make that 3⃣!
Hardik Pandya with his first wicket of the match ? ?
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #TeamIndia | #USAvIND pic.twitter.com/C4heCw4FTT
— BCCI (@BCCI) June 12, 2024
మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అమెరికాకు అర్ష్‌దీప్ సింగ్ షాకులు ఇచ్చాడు. మొదటికి బంతికి షాయన్ జహంగీర్ (0) ను ఎల్భీడబ్ల్యూగా ఔట్ చేసిన అతడు ఆఖరి బంతికి ఆండ్రీస్ గౌస్ (2) ను పెవిలియన్‌కు చేర్చాడు. 1 ఓవర్‌కు అమెరికా స్కోరు 3/2. స్టీవెన్ టేలర్ (0) క్రీజులో ఉన్నాడు.
What. A. Start! ? ?
2⃣ wickets in the first over by Arshdeep Singh ? ?
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #TeamIndia | #USAvIND pic.twitter.com/oEU3dCBoaQ
— BCCI (@BCCI) June 12, 2024
అమెరికా జట్టు : స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్
భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
A look at #TeamIndia‘s Playing XI ?
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #USAvIND pic.twitter.com/iljf2ozCjn
— BCCI (@BCCI) June 12, 2024
టాస్..
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ 8 చేరుకుంటుంది. ఈ కీలక మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో అమెరికా మొదట బ్యాటింగ్ చేయనుంది.
? Toss Update ?
Captain Rohit Sharma has won the toss & #TeamIndia have elected to bowl against USA.
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #USAvIND | @ImRo45 pic.twitter.com/WWgfs7NJRT
— BCCI (@BCCI) June 12, 2024