బంగ్లాదేశ్‌తో జాగ్రత్త.. ఈ మూడు సమస్యలను అధిగమిస్తే కప్ టీమిండియాదే!

టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ జట్టును ప్రధానంగా మూడు సమస్యలు వేధిస్తున్నాయి. ఈ మూడు సమస్యలను జట్టు సరిదిద్దుకుంటే కప్ భారత్ వంశం అవుతుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బంగ్లాదేశ్‌తో జాగ్రత్త.. ఈ మూడు సమస్యలను అధిగమిస్తే కప్ టీమిండియాదే!

IND vs BAN Match

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఓటమి లేకుండా దూసుకెళ్తోంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ లలో విజయం సాధించిన భారత్ జట్టు.. సూపర్ -8లో ఆఫ్గనిస్థాన్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడి విజయం సాధించింది. శనివారం రాత్రి 8గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) సూపర్ -8లో భారత్ జట్టు రెండో మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ జట్టును ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే సెమీఫైనల్ కు చేరే అవకాశాలు మెరుగవుతాయి. బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనావేస్తే టీమిండియాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగ్లా జట్టు బలంగానే ఉంది. టోర్నీలో ఆ జట్టు బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు.

Also Read : Sania Mirza : ష‌మీతో సానియా మీర్జా పెళ్లి..? మౌనం వీడిన టెన్నిస్ స్టార్ తండ్రి

టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ జట్టును ప్రధానంగా మూడు సమస్యలు వేధిస్తున్నాయి. ఈ మూడు సమస్యలను జట్టు సరిదిద్దుకుంటే కప్ భారత్ వంశం అవుతుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. టోర్నీ ప్రారంభం నుంచి భారత్ ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేక పోతున్నారు. విరాట్ కోహ్లీ ఫామ్ కూడా జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీ ఓపెనర్ గా ఆడుతున్నాడు. కానీ, విజయవంతం కాలేదు. బంగ్లాతో మ్యాచ్ లోనూ కోహ్లీ పేలువ ప్రదర్శన కనబరిస్తే భారత్ జట్టుకు ఇబ్బందికర పరిస్థితే ఎదురవుతుంది. ఆప్గానిస్థాన్ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు విఫలమయ్యారు. పరుగులు రాబట్టలేకపోయారు.. సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ సెంచరీతో ఆదుకోకుంటే జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం కావాల్సి వచ్చేది.

Also Read : Marnus Labuschagne : ప‌క్షిలా గాల్లోకి ఎగిరి.. ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌.. మీ క‌ళ్ల‌ని మీరే న‌మ్మ‌లేరు.

కోహ్లీ ఐర్లాండ్ జట్టుపై ఒక పరుగు, పాకిస్థాన్ జట్టుపై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. అమెరికా జట్టుపై ఖాతాకూడా తెరవలేకపోయాడు. సూపర్ -8 మ్యాచ్ లో ఆఫ్గాన్ పై కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. శనివారం రాత్రి బంగ్లాతో జరిగే మ్యాచ్ లో కోహ్లీ రాణిస్తే భారత్ విజయం తేలికవుతుంది. కోహ్లీతోపాటు మరోఓపెనర్ రోహిత్ శర్మకూడా తక్కువ పరుగులకే ఔట్ అవుతున్నాడు. ఐర్లాండ్ పై అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. పాకిస్థాన్ పై 13, అమెరికా జట్టుపై మూడు, ఆఫ్గానిస్థాన్ జట్టుపై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లా జట్టుపైనా ఇదేపరిస్థితి కొనసాగితే భారత్ జట్టుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయినట్లే.

Also Read : Pat Cummins : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో తొలి హ్యాట్రిక్‌.. బంగ్లాదేశ్ పై పాట్ క‌మిన్స్ ఘ‌న‌త‌..

టీమిండియాలో చాలామంది ఆల్ రౌండర్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో రవీంద్ర జడేజా తుదిజట్టులో ఆడుతున్నాడు. కానీ, బ్యాటింగ్, బౌలింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. పాక్ పై డకౌట్ కాగా, ఆఫ్గాన్ పై ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్గనిస్థాన్ పై తీసిన వికెట్లు ఒక్కటి మాత్రమే. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ జడేజాకూడా రాణిస్తే భారత్ కు విజయావకాశాలు మెరుగువుతాయి. వీరికితోడు భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగుల వరద పారించాల్సి ఉంటుంది. మరి బంగ్లాపై టీమిండియా ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.