T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా .. చివర్లో మ్యాజిక్ చేసిన షమీ..

ఆరు బంతులకు 11 పరుగులు అవసరం కాగా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. మరో రన్‌ఔట్ కావటంతో చివరి ఓవర్‌లో మొత్తం నాలుగు వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు 20 ఓవర్లలో 180 పరుగులకు అలౌట్ అయ్యారు. ఆరు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా .. చివర్లో మ్యాజిక్ చేసిన షమీ..

T20 World Cup

Updated On : October 17, 2022 / 1:53 PM IST

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా సోమవారం మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మ్యాజిక్ కు ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

T20 World Cup 2022: శ్రీలంక జట్టుకు షాకిచ్చిన నమీబియా.. 55 పరుగుల తేడాతో విజయం ..

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాకు  ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ అర్థశతకం సాధించడంతో టీమిండియా ఏడు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 75 పరుగులు చేసింది. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ అవుట్ య్యాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 79 పరుగులు. వెంటనే 80 పరుగుల వద్ద రోహిత్ శర్మ (15) అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కేవలం 19 పరుగులకే పెవిలిన్ బాట పట్టాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(2) వద్ద అవుట్ కావటంతో 14 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. చివరిలో సూర్యకుమార్ అర్థసెంచరీతో తుఫాన్ వేగంతో పరుగులు రాబట్టాడు. దినేశ్ కార్తీక్ (20) కూడా రాణించడంతో భారత్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతూ వచ్చింది. 35 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ 8వ ఓవర్ లో 76 పరుగుల వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్ 76 పరుగులు, గ్లెన్ మ్యాక్స్ వెల్ 23 పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. చివరి ఓవర్లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఆరు బంతులకు 11 పరుగులు అవసరం కాగా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. మరో రన్‌ఔట్ కావటంతో చివరి ఓవర్‌లో మొత్తం నాలుగు వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు 20 ఓవర్లలో 180 పరుగులకు అలౌట్ అయ్యారు. ఆరు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.