Gautam Gambhir: ‘నిన్ను చంపేస్తాం’.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Gautam Gambhir: ‘నిన్ను చంపేస్తాం’.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు

Gautam Gambhir

Updated On : April 24, 2025 / 9:48 AM IST

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. రెండు మెయిల్స్ ద్వారా నిన్ను చంపేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తనకు వచ్చిన మెయిల్స్ ఆధారంగా గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐసిస్ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు.

 

మంగళవారం మధ్యాహ్నం గంభీర్ కు రెండు బెదిరింపు ఈ – మెయిల్స్ వచ్చాయి. ఒకటి మధ్యాహ్నం, మరొకటి సాయంత్రం. ఈ రెండు ఈ-మెయిల్స్ లో ‘‘నిన్ను చంపేస్తాం’’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే, గంభీర్ ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2021లో గంభీర్ బీజేపీ ఎంపీగా ఉన్న సమయంలో గంభీర్ కు ఇలాంటి ఈ-మెయిల్ బెదిరింపు వచ్చింది. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తనకు బెదిరింపులు రావడం పట్ల గంభీర్ సీరియస్ గా తీసుకున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరినట్లు తెలిసింది.

 

గంభీర్ తన కుటుంబంతో కలిసి గత నెలలో సెలవుల కోసం ఫ్రాన్స్ కు వెళ్లాడు. ఈనెల ప్రారంభంలో స్వదేశానికి తిరిగొచ్చారు. మార్చిలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తరువాత అతను జట్టుకు అందుబాటులో లేరు. ప్రస్తుతం ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) టోర్నమెంట్ జరుగుతుండటంతో గంభీర్ కు విరామం దొరికింది.