Team India : వాంఖడేలో వందేమాతరం గీతాలాపన సమయంలో క్రికెటర్ల వీడియో చూశారా.. గూజ్‌బమ్స్ అంతే!

టీమిండియా క్రికెటర్లు వరల్డ్ కప్ ట్రోపీతో అభిమానులకు అభివాదం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిరిగారు. ఈ సమయంలో వందేమాతరం గేయంతో ..

Team India : వాంఖడేలో వందేమాతరం గీతాలాపన సమయంలో క్రికెటర్ల వీడియో చూశారా.. గూజ్‌బమ్స్ అంతే!

Team India Players in Wankhede

Team India singing ‘Vande Maataram’ with Wankhede crowd : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో విజయం తరువాత క‌రేబియ‌న్ దీవుల నుంచి స్వ‌దేశానికి చేరుకున్న భారత్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ముంబయిలోని మెరైన్ డ్రైవ్ లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం వాంఖ‌డే స్టేడియంలో భార‌త ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ స‌న్మానించింది. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియంలో అభిమానులతో కిక్కిరిసిపోయింది. వందేమాతరం గీతాలాపన సమయంలో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ సమయంలో టీమిండియా క్రికెటర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Team India : వాంఖడే స్టేడియంలో కోహ్లీ, రోహిత్ భావోద్వేగ ప్రసంగం.. వారు ఏమన్నారంటే

టీమిండియా క్రికెటర్లు వరల్డ్ కప్ ట్రోపీతో అభిమానులకు అభివాదం చేస్తూ వాంఖడే స్టేడియం మొత్తం తిరిగారు. ఈ సమయంలో వందేమాతరం గేయంతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మతోపాటు ఇతర క్రికెటర్లుసైతం అభిమానులతో కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపిస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా తదితరులు చేతులు పైకెత్తి వందేమాతరం అంటూ బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తూ  కామెంట్లు చేస్తున్నారు.

Also Read : Mahmudullah : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓట‌మి.. మ‌రో స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ క్రికెట్‌కు వీడ్కోలు..