Team India New Jersey: కొత్త జెర్సీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు.. వీడియో అదుర్స్.. జెర్సీ ధర ఎంతంటే?

ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. టీమిండియా ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు.

Team India New Jersey: కొత్త జెర్సీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు.. వీడియో అదుర్స్.. జెర్సీ ధర ఎంతంటే?

Team india

Updated On : June 4, 2023 / 9:38 AM IST

New Jersey: ఐపీఎల్ (IPL) ముగించుకొని టీమిండియా ప్లేయర్లు (Team India players) ఇంగ్లాండ్ (England) గడ్డపై అడుగుపెట్టారు. లండన్‌ (London) లోని ఒవెల్ మైదానంలో మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక భారత్ – ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయర్లు కొత్త జెర్సీ (New Jersey) తో బరిలోకి దిగనున్నారు. అడిడాస్ (Adidas) మూడు ఫార్మాట్లలో కొత్త జెర్సీని గురువారం ఆవిష్కరించిన విషయం విధితమే. తాజాగా టీమిండియా స్టార్ ప్లేయర్లు కొత్త జెర్సీని ధరించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో క్రికెటర్లు జాతీయ జెర్సీని ధరించడం యొక్క అర్థాన్ని వివరించారు.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు ఆస్ట్రేలియాను భ‌య‌పెడుతున్న చెత్త రికార్డు

టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బూమ్రా, మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్, స్మృతి మంధాన సహా ఇతర మహిళా క్రికెటర్లు సరికొత్త జెర్సీని ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ శనివారం అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘మీరు కేవలం ఒక విషయం అనుభూతి చెందేలా చేసే జెర్సీ, ఇంపాజిబుల్ ఈజ్ నథింగ్!’ అని రాసిఉంది.

WTC Final 2023: న‌యావాల్‌ మారిపోయాడా..! టీమ్‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం లేదు.. సొంత కారులో.. ఆశ్చ‌ర్య‌పోయిన జ‌డేజా

ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. టీమిండియా ఆటగాళ్లు ఈ నూతన జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు. జూన్ 7 నుంచి లండన్‌లో జరిగే భారత్ – ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు కొత్త తెల్లటి జెర్సీని టీమిండియా ప్లేయర్లు ధరించనున్నారు. అయితే, ఈ కొత్త జెర్సీ ధర ఎంతో తెలుసా? టీమిండియా ప్లేయర్లు ధరించే కొత్త జెర్సీ విలువ రూ. 4,999.

 

 

కొత్త జెర్సీలను క్రికెట్ అభిమానులు కొనుగోలు చేయొచ్చు. అడిడాస్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఈ జెర్సీ ధర రూ. 4,999 ఉంది. ప్యాంట్లు విడిగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. రూ. 4,599 వద్ద అందుబాటులో ఉన్నాయి. వన్డే రెప్లికా జెర్సీ రూ. 2,999కి అందుబాటులో ఉండగా, వన్డే ఫ్యాన్ జెర్సీ ధర రూ. 999 ఉంది. అదనంగా, ‘ADICLUB’ సభ్యులుగా ఉన్న అభిమానులు జూన్ 4న ఉదయం 10గంటలకు జెర్సీలను ముందుగా యాక్సెస్ చేయొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)