Yashasvi Jaiswal : రూ.5 కోట్ల‌తో ముంబైలో ప్లాట్ కొన్న య‌శ‌స్వి జైస్వాల్‌..!

టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ ముంబైలో అత్యంత ఖ‌రీదైన బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో ఓ కొత్త ఫ్లాట్‌ను కొన్న‌ట్లు స‌మాచారం.

Yashasvi Jaiswal : రూ.5 కోట్ల‌తో ముంబైలో ప్లాట్ కొన్న య‌శ‌స్వి జైస్వాల్‌..!

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal buy new flat : ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ ముంబైలో అత్యంత ఖ‌రీదైన బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో ఓ కొత్త ఫ్లాట్‌ను కొన్న‌ట్లు స‌మాచారం. త‌న క‌ల‌ల ఇంటి కోసం రూ.5.38 కోట్లు అత‌డు వెచ్చించిన‌ట్లుగా తెలుస్తోంది. బాంద్రా ఈస్ట్‌లో ఉన్న బీకేసీ ప్రాజెక్టులో అత్యంత అధునాత‌న స‌దుపాయాలు ఉన్న ఫ్లాట్‌ను య‌శ‌స్వి గ‌ల నెల‌లోనే త‌న పేరిట రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లు మనీకంట్రోల్ తెలిపింది.

1,110 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ఉన్న‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మాణంలో ఉంద‌ని, దీన్ని అదానీ రియాలిటీ నిర్మిస్తోంద‌న్నారు. స్ట్రీట్‌పుడ్ అమ్మి కుటుంబాన్ని పోషించ‌డంతో పాటు టీమ్ఇండియా ఎంపిక కావ‌డం కోసం ఎన్నో క‌ష్టన‌ష్టాల‌ను ఓర్చుకున్న జైస్వాల్ ప్ర‌స్తుతం బాంద్రాలో త‌న క‌ల‌ల ఇంటిని కొనుగోలు చేశాడు. ఇటీవ‌లే అత‌డు థానేలో త‌న త‌ల్లిదండ్రుల కోసం ఐదు బెడ్‌రూమ్‌ల ల‌గ్జ‌రీ ఫ్లాట్‌ను కొన్న సంగ‌తి తెలిసిందే.

6 Sixes In 1 Over : ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు కొట్టిన తెలుగు క్రికెట‌ర్‌.. బీసీసీఐ అల‌ర్ట్..

ప‌రుగుల వ‌ర‌ద‌..

య‌శ‌స్వి జైస్వాల్ టెస్టు కెరీర్ అద్భుతంగా ప్రారంభ‌మైంది. మంచినీళ్లు తాగినంత సుల‌భంగా డ‌బుల్ సెంచరీలు బాదేస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లోనూ డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచుల్లో 545 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో త‌న కెరీర్ అత్యుత్త‌మ ర్యాంకుకు చేరుకున్నాడు. ఏకంగా 14 స్థానాలు మెరుగుప‌ర‌చుకుని టాప్ 15లోకి వ‌చ్చాడు.

మొత్తంగా జైస్వాల్ ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 7 టెస్టులు, 17 టీ20లు ఆడాడు. 7 టెస్టుల్లో 861 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, రెండు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 17 టీ20ల్లో 502 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, నాలుగు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో 37 మ్యాచులు ఆడాడు. 1,172 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం, 8 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

Babar Azam : చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. టీ20క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా ప్ర‌స్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికీ భార‌త్ బ‌లంగా పుంజుకుంది. విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు, రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించింది. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 23 నుంచి రాంచీ వేదిక‌గా ప్రారంభం కానుంది.