Global Chess League: జూన్ 21 నుంచి టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్
ఈ లీగ్‌లో డబుల్ రౌండ్ - రాబిన్ ఫార్మాట్‌లో ఆరు ఫ్రాంచైజీల్లోని ప్రతి జట్టు మొత్తం 10 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి.

Global Chess League
Global Chess League – Tech Mahindra: టెక్ మహీంద్రా, అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఎఫ్‌ఐడీఈ (FIDE) జాయింట్ వెంచర్ గ్లోబల్ చెస్ లీగ్ (GCL) మొట్టమొదటి ఎడిషన్ జూన్ 21 నుంచి జూలై 2 వరకు జరగనుంది. దుబాయ్ చెస్ అండ్ కల్చర్ క్లబ్, దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ఈ లీగ్‌లో డబుల్ రౌండ్ – రాబిన్ ఫార్మాట్‌లో ఆరు ఫ్రాంచైజీల్లోని ప్రతి జట్టు మొత్తం 10 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. ఆరు టీమ్ లలో కనీసం ఇద్దరు చొప్పున మహిళా చెస్ ఛాంపియన్లు ఉంటారు. బెస్ట్ ఆఫ్ సిక్స్ బోర్డ్ స్కోరింగ్ పద్ధతిలో విజేతను ప్రకటిస్తారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జూలై 2న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తాయి.
ఈ తొలి ఎడిషన్ లో చెస్ దిగ్గజం, గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్ (Magnus Carlsen) కూడా పాల్గొననున్నారు. ఈ లీగ్ తనకు సరికొత్త అనుభూతినిస్తుందని అన్నారు. ఇలాంటి లీగ్ లో గతంలో ఎన్నడూ పాల్గొనలేదని తెలిపారు. జట్టు ఫార్మాట్ మ్యాచ్‌లంటే తనకు చాలా ఆసక్తి అని అన్నారు. చెస్ లో భారత్ చాలా వ్యూహత్మకంగా కృషి చేస్తోందని తెలిపారు. టెక్ మహీంద్రా వంటి భాగస్వామి చెస్ విభాగంలో చేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.