Hockey WC 2023: నాకౌట్‌కు వెళ్లాలంటే గెలవాల్సిందే.. నేడు న్యూజిలాండ్‌తో భారత్ కీలకపోరు
న్యూజిలాండ్ పై భారత్ జట్టుది పైచేయిగానే ఉంది. ప్రస్తుతం హాకీ ప్రపంచకప్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు ఆరో స్థానంలోఉంది. న్యూజిలాండ్ జట్టు 12వ స్థానంలో ఉంది. మొత్తంమీద భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య 44హాకీ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 24, న్యూజిలాండ్ 15 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఐదు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Hockey WC 2023
Hockey WC 2023: ఒడిశాలో జరుగుతున్న 15వ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జట్టు నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. ఈరోజు రాత్రి 7గంటలకు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వేల్స్‌తో పోరులో ఆశించిన స్థాయిలో భారత్ ఆటగాళ్లు రాణించలేకపోయారు.. ఫలితంగా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరే అవకాశాన్ని హర్మన్ ప్రీత్ బృందం చేజార్చుకుంది. క్రాస్ ఓవర్లో గెలిచి ముందంజ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు క్రాస్ ఓవర్లో భారత్ హాకీ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్ నాకౌట్ మాదిరిగానే ఉంటుంది. గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు 9 నుంచి 12వ స్థానంకోసం పోరాడే అవకాశం ఉంటుంది.
న్యూజిలాండ్ పై భారత్ జట్టుది పైచేయిగానే ఉంది. ప్రస్తుతం హాకీ ప్రపంచకప్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు ఆరో స్థానంలోఉంది. న్యూజిలాండ్ జట్టు 12వ స్థానంలో ఉంది. మొత్తంమీద భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య 44హాకీ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 24, న్యూజిలాండ్ 15 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఐదు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. గత నాలుగు మ్యాచ్‌లలో భారత్ జట్టే విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్ లో భారత్ జట్టే విజయం సాధిస్తున్న ధీమాను హాకీ అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.
ప్రపంచకప్‌లో భారత్ ఆటగాళ్లు మంచిప్రదర్శనే ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో స్పెయిన్ పై, మూడో మ్యాచ్‌లో వేల్స్ పై భారత్ జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడి డ్రాగా ముగించింది. నేడు జరిగే మ్యాచ్ లో భారత్ విజయంసాధిస్తే క్వార్టర్స్‌లో బెల్జియం జట్టును ఢీకోనుంది. బెల్జియం బలమైన జట్టు. అయితే.. సొంత ఇలాకాలో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. గాయంతో హార్ధిక్ సింగ్ టోర్నీకి దూరం కావటం భారత్ జట్టుకు కొంతఇబ్బందికరమే. అయినప్పటికీ న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించి బెల్జియంను ఢీకొట్టేందుకు భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.