India vs Bangladesh: ముగిసిన రెండో రోజు ఆట.. 133 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు, రెండో రోజు ఆటలో భారత జట్ట ఆధిక్యంలో ఉంది. ఇండియా 404 పరుగులు చేసి ఆలౌటవ్వగా, ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

India vs Bangladesh: ముగిసిన రెండో రోజు ఆట.. 133 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

Updated On : December 15, 2022 / 5:35 PM IST

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో గురువారం రెండో రోజు ఆట ముగిసింది. సాయంత్రం ఆట పూర్తయ్యే సమయానికి బంగ్లాదేశ్ 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అంతకుముందు లంచ్ సమయానికి భారత్ 404 పరుగులకు ఆలౌటైంది.

Mumbai: అదృష్టమంటే అతడిడే.. బస్సు కింద పడ్డా బతికిపోయాడు.. వైరల్ వీడియో

రెండో రోజు ఆట ఆరంభించిన భారత జట్టు త్వరగానే శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 192 బంతుల్లో 86 పరుగులు చేసి ఔటయ్యాడు. హొసేనే బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. నిలకడగా ఆడుతూ ఇండియా మంచి స్కోరు సాధించడంలో సాయపడ్డారు. అశ్విన్ నెమ్మదిగా ఆడుతూ 113 బంతుల్లో 58 పరుగులు చేయగా, కుల్దీప్ యాదవ్ 114 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఔటయ్యాక వచ్చిన మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే, సిరాజ్ 4 పరుగులకే ఔటవ్వగా, ఉమేష్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇండియా 133.5 ఓవర్లలో 404 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, మెహెదీ హసన్ చెరో 4 వికెట్లు తీశారు.

Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

ఎబడాట్, ఖలీద్ తలో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. తొలి బంతికే ఓపెనర్ నజ్ముల్ హొసైన్ షాంటో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత యాసిర్ అలీ నాలుగు పరుగులే చేసి ఉమేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జకీర్ హసన్ 45 బంతుల్లో 20 పరుగులు, లిటన్ దాస్ 30 బంతుల్లో 24 పరుగులు, షకిబ్ అల్ హసన్ 25 బంతుల్లో 3 పరుగులు, ముష్ఫికర్ రహీమ్ 58 బంతుల్లో 28 పరుగులు, నురుల్ హసన్ 22 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటవ్వగా, తైజుల్ ఇస్లామ్ 4 బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగారు. మెహిదీ హసన్ మిరాజ్ 35 బంతుల్లో 16 పరుగులతో, ఎబాడాట్ హొసైన్ 27 బంతుల్లో 13 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీమిండియా 271 పరుగుల ఆధిక్యంలో ఉంది.