Australia Test Captain: ఆస్ట్రేలియా కెప్టెన్సీకి రాజీనామా..

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీకి రాజీనామా ఇచ్చేశాడు టిమ్ పైన్. తోటి మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన నేపథ్యంలో స్వచ్ఛందంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు టిమ్‌పైన్‌ కెప్టెన్సీకి రాజీనామా

Australia Test Captain:  ఆస్ట్రేలియా కెప్టెన్సీకి రాజీనామా..

Tim Paine Australia

Updated On : November 19, 2021 / 12:36 PM IST

Australia Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీకి రాజీనామా ఇచ్చేశాడు టిమ్ పైన్. తోటి మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన నేపథ్యంలో స్వచ్ఛందంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు టిమ్‌పైన్‌ కెప్టెన్సీకి రాజీనామా ఇచ్చేశాడు. 2017లో ఓ మహిళకు అసభ్యకర రీతిలో ఫొటోతో పాటు పలు మెసేజ్‌లు పంపాడని ఇటీవల క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణలో వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌గా ఉండేందుకు అనర్హుడినని ఒప్పుకుంటూ శుక్రవారం మీడియా ముందుకొచ్చాడు. కష్టమైన నిర్ణయమే అయినా.. తన కుటుంబానికి, ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇదే మంచి నిర్ణయమని తెలిపాడు.

2018లో అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని నిషేధానికి గురవడంతో పైన్‌ ఆసీస్‌ టెస్టు పగ్గాలు అందుకున్నాడు. మూడేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగిన పైన్.. చివరికి రాజీనామా చేశాడు. డిసెంబర్ 8 నుంచి ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా టీమ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు పైన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జట్టుపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

////////////////: 700 మంది రైతులు అమరులు..కేంద్రం మొండి వైఖరే కారణం: \\\\\\\\\\\\\\\\\\