Tokyo Olympics : ఒలింపిక్స్ హాకీలో భారత్ విక్టరీ!
టోక్యో ఒలింపిక్స్ లో ఐదోరోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హాకీ మినహా మిగిలిన ఈవెంట్లలో భారత్ ఓటమి పాలైంది. ఒలిపింక్స్ హాకీలో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. పూల్-A మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో టీమిండియా గెలిచింది.

Tokyo Olympics, India Hockey Defeats Spain 3 0
Tokyo Olympics, India Hockey defeats Spain 3-0 : టోక్యో ఒలింపిక్స్ లో ఐదోరోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హాకీ మినహా మిగిలిన ఈవెంట్లలో భారత్ ఓటమి పాలైంది. ఒలిపింక్స్ హాకీలో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. పూల్-A మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో టీమిండియా గెలిచింది. నాలుగు క్వార్టర్స్‌లోనూ పూర్తి ఆధిపత్యం దిశగా దూసుకెళ్లిన భారత్.. స్పెయిన్ ను మట్టికరిపించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించింది. మంగళవారం (జూలై 27) ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌పై భారత్ ఆది నుంచి ఆధిపత్యాన్ని కనబరుస్తూ వచ్చింది.
మూడు క్వార్టర్స్ ముగిసేసరికి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి నాల్గో క్వార్టర్స్ లో రూపిందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ తో అదరగొట్టేశాడు. మ్యాచ్‌లో 15 నిమిషాలు, 51 నిమిషాల సమయంలో రెండు గోల్స్ వేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిమ్రన్‌జీత్ సింగ్ ఒక గోల్ సాధించాడు. దాంతో మొదటి స్పెల్‌లో రెండు గోల్స్ చేసిన భారత్.. రెండవ స్పెల్‌లో కొంచెం కట్టుదిట్టం చేసింది. స్పెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది. అయినా భారత్ ధీటుగానే ఎదుర్కొంటూ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
#HaiTayyar #IndiaKaGame #TeamIndia #Tokyo2020 #TokyoTogether #Cheer4India #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/FS1yOVmEVu
— Hockey India (@TheHockeyIndia) July 27, 2021
మరోవైపు.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ విభాగంలో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. మెడల్ ఈవెంట్ కు సౌరబ్-మనుబాకర్ అర్హత సాధించలేకపోయారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్ కు సాత్విక్-చిరాగ్ చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో శరత్‌కమల్ నిష్క్రమించాడు.
ఒలింపిక్స్ మూడవ రౌండ్‌లో చైనా ప్లేయర్ మా లాంగ్ చేతిలో పరాజయం పాలై ఇంటిదారిపట్టాడు. 4-1 తేడాతో మా లాంగ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి గేమ్‌ను 11-7 స్కోర్‌తో లాంగ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఆచంట కమల్ దూకుడును ప్రదర్శించాడు. 11-8 తేడాతో కమల్ గెలుచుకున్నాడు. కానీ, తర్వాతి గేమ్‌లలో ఆచంట నెగ్గలేకపోయాడు. సోమవారం రెండవ రౌండ్‌లో పోర్చుగల్ ఆటగాడిపై పైచేయి సాధించిన కమల్ మంగళవారం ఆటలో నిరాశపరిచాడు.