ODI World Cup 2023 : ఉప్పల్ స్టేడియానికి క్యూ కట్టిన టాలీవుడ్ నటులు.. వార్మప్ మ్యాచులకే ఇలా అయితే.. ఇంకా..!
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో టాలీవుడ్ నటులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

AUS vs PAK Warm up match
ODI World Cup 2023 Warm up match : మన దేశంలో క్రికెట్ గేమ్ కు ఉండే క్రేజే వేరు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ క్రికెట్ అంటే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో కొందరు నటులకు క్రికెట్ పై ఉండే మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారు విక్టరీ వెంకటేష్. మన దేశంలో మ్యాచులు ఎక్కడ జరిగినా సరే వెలుతుంటారు. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగితే చెప్పాల్సిన పనే లేదు. మ్యాచ్‌కు హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటారు.
ప్రేక్షకులకు ఎంట్రీ..
మరో రెండు రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానుంది. అంతకంటే ముందు వార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి. ఉప్పల్ స్టేడియం రెండు వార్మప్ మ్యాచులతో పాటు మూడు వరల్డ్ కప్ మ్యాచులకు (అక్టోబర్ 6న పాకిస్తాన్ vs నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్తాన్ vs శ్రీలంక) ఆతిథ్యం ఇవ్వనుంది.
కివీస్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌కు ఉప్పల్‌లో ప్రేక్షకులను అనుమతించలేదు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండలు ఉండడంతో భద్రత కల్పించలేమని పోలీసులు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నేడు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులను అనుమతి ఇచ్చారు.
టాలీవుడ్ నటుల సందడి..
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో.. టాలీవుడ్ నటులు ఆది, సాయికుమార్, విక్టరీ వెంకటేష్‌లు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను హీరో ఆది తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

Aadi-Saikumar
ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభ వేడుకలు రద్దు..!
ఇదిలా ఉంటే.. టీమ్ ఇండియా ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
View this post on Instagram