IND vs AUS: భార‌త్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు

భార‌త్‌తో మూడో టెస్టు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు

Travis Head

Travis Head: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా గర్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ లు సెంచరీలతో చెలరేగారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డును సాధించాడు. ఒకే ఏడాదిలో ఒక వేదికపై రెండు ఇన్నింగ్స్ లోనూ గోల్డెన్ డకౌట్ (కింగ్ పెయిర్) కావడంతో పాటు, అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా హెడ్ నిలిచాడు.

Also Read: IND vs AUS : అట్లుంటది సిరాజ్‌తో పెట్టుకుంటే.. లబుషేన్, సిరాజ్ మధ్య ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

గర్బా మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో ట్రవిస్ తాజాగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మైదానంలో ట్రవిస్ హెడ్ గతంలో ఏడు ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ చేయగా.. 84(187 బంతుల్లో), 24(29బంతుల్లో), 152(148 బంతుల్లో), 92(96బంతుల్లో), 0(1), 0(1), 0(1) పరుగులు చేశాడు. తాజాగా భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్ లలో డకౌట్ కావడంతో పాటు సెంచరీ చేసిన ఆరో బ్యాటర్ గా ట్రవిస్ హెడ్ నిలిచాడు. అంతకుముందు ఈ జాబితాలో వాజిర్ మహ్మద్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్ -1958), అల్విన్ కాళిచరణ్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్-1974), మార్వన్ ఆటపట్టు (కొలంబో ఎస్ఎస్సీ-2001), రామ్ నరేశ్ శర్వాణ్ (కింగ్ స్టన్ -2004), మహ్మద్ ఆఫ్రాపుల్ (చట్టోగ్రామ్ ఎంఏ అజీజ్ -2004)లు ఉన్నారు.

Also Read: IND vs AUS: నితీశ్ రెడ్డి సూపర్ బౌలింగ్.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా.. వీడియో వైరల్

ఇదిలాఉంటే.. టెస్టుల్లో హెడ్ కు ఇది తొమ్మిదో సెంచరీ. తన తొమ్మిది సెంచరీల్లో మూడు సెంచరీలు భారత్ జట్టుపైనే ఉండటం విశేషం. 2023లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో హెడ్ 163 పరుగులు చేశాడు. ఇటీవల ఆడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 140 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక భూమిక పోషించాడు. తాజాగా గబ్బాలో జరుగుతున్న టెస్టులో హెడ్ సెంచరీ చేశాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే గబ్బా వేదికగా జరిగిన చివరి మూడు టెస్టుల్లో మూడు సార్లు ఫస్ట్ బాల్ కే హెడ్ డకౌట్ అయ్యాడు. కాగా ప్రస్తుతం భారత్ జరుగుతున్న మ్యాచ్ లో హెడ్ (152) సెంచరీ చేశాడు.