Pakistani Cricketer: పాక్ క్రికెటర్ తీరుతో జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్.. వీడియో వైరల్
కరాచీలో పాకిస్థాన్ వర్సెన్ న్యూజీలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ విజయం సాధించింది. మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడు విసిరిన బాల్ అంపైర్ కాలుకు తాకింది. దీంతో ఆయన తనవద్ద ఉన్న పాక్ క్రికెటర్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pakistan cricketr
Pakistani Cricketer: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ వసీం జూనియర్ చేసిన పనికి అంపైర్ అలీమ్ దార్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన అంపైర్.. తనవద్ద ఉన్న పాక్ క్రికెటర్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆ తరువాత పాక్ క్రికెటర్ నసీం అంపైర్ వద్దకువెళ్లి మోకాలు కిందభాగంలో మసాజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
కరాచీలో పాకిస్థాన్ వర్సెన్ న్యూజీలాండ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ విజయం సాధించింది. మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ వసీం జూనియర్ ఫీల్డింగ్ సమయంలో బాల్‌ను వికెట్లకు విసిరాడు. ఆ బాల్‌కాస్త ఆన్ ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్ కాలుకు తాకింది. బలంగా తాకినట్లు ఉంది.. అంపైర్ కు ఒక్కసారిగా కోపం వచ్చింది.. తన చేతిలోఉన్న పాక్ క్రికెటర్ జెర్సీని నేలకేసి కొట్టాడు.
View this post on Instagram
అంపైర్ తీరుతో కంగుతిన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, ఇతర క్రికెటర్లు అలీమ్ దార్ వద్దకు వెళ్లారు. నసీమ్ షా అంపైర్ కుడికాలు పట్టుకొని మోకాలికింది భాగంలో బాల్ తగిలిన చోట కొద్దిసేపు మసాజ్ చేశాడు. దీంతో అంపైర్ కోపం తగ్గింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.