Vaibhav Suryavanshi : డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడుపుతున్న వైభవ్ సూర్యవంశీ.. మైదానంలోనే.. వీడియో వైరల్..
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ (Vaibhav Suryavanshi) విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.
Vaibhav Suryavanshi drive car without license video viral (pIc credit@IPL)
- ప్రాక్టీస్ సెషన్ మధ్యలో వైభవ్ సూర్యవంశీ ఆటలు
- రిమోట్ కారుతో
- ఆటపట్టించిన కోచింగ్ స్టాఫ్
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలోనూ విజయం సాధించింది. ఆ జట్టు ఖాతలో 6 పాయింట్లు ఉండగా.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ విజయాల్లో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. జట్టులో ఎలాంటి వాతావరణం ఉందో తెలియజేస్తూ రాజస్థాన్ రాయల్స్ ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రాక్టీస్ సెషన్ మధ్యలో రిమోట్ కారుతో ఆడలాడుకుంటున్నాడు. అతడు రియోట్ కారుతో ఆటలాడుతుండగా టీమ్ సిబ్బంది వీడియోను రికార్డు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
LSG : గెలుపు జోష్‌లో ఉన్న లక్నోకు భారీ షాక్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్టార్ ప్లేయర్ ఔట్..
ఇక సపోర్టు స్టాఫ్ అయితే.. వైభవ్‌ను సరదాగా ఆటపట్టించారు. అతడికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదని, అయినప్పటికి కూడా అతడు కారు నడుపుతున్నాడని అన్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Just Vaibhav being Vaibhav 😂💗 pic.twitter.com/qUDNalj9rN
— Rajasthan Royals (@rajasthanroyals) April 9, 2026
ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు వైభవ్ సూర్య వంశీ మూడు మ్యాచ్‌లు ఆడాడు. 248 పైకి స్ట్రైక్‌రేటుతో 122 పరుగులు సాధించాడు.
