Vaibhav Suryavanshi friend : వైభ‌వ్ సూర్య‌వంశీనే అంటే అత‌డి ఫ్రెండ్ అంత‌కంటే తోపులా ఉన్నాడే.. 134 బంతుల్లో 327 రన్స్‌..

వైభ‌వ్ సూర్య‌వంశీ స్నేహితుడు అయాన్ రాజ్ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించాడు.

Vaibhav Suryavanshi friend : వైభ‌వ్ సూర్య‌వంశీనే అంటే అత‌డి ఫ్రెండ్ అంత‌కంటే తోపులా ఉన్నాడే..  134 బంతుల్లో 327 రన్స్‌..

Vaibhav Suryavanshi friend smashes 327 off 134 balls

Updated On : June 16, 2025 / 2:55 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్ ద్వారా 14 ఏళ్ల యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లీగ్‌లో అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన పిన్న వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇక ఇప్పుడు అత‌డి స్నేహితుడు అయాన్ రాజ్ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. బీహార్‌కు చెందిన 13 ఏళ్ల అయాన్ రాజ్ ముజ‌ఫ‌ర్‌పూర్‌లో జ‌రిగిన డిస్ట్రిక్ట్ లీగ్ 30 ఓవ‌ర్ల మ్యాచ్‌లో 327 ప‌రుగులు చేశాడు.

సంస్కృతి క్రికెట్ అకాడమీకి ప్రాతినిథ్యం వ‌హించిన‌ రాజ్ 134 బంతులు ఎదుర్కొన్నాడు. 22 సిక్సర్లు, 41 ఫోర్లతో అజేయంగా 327 పరుగులు సాధించాడు. అత‌డి స్ట్రైక్ రేట్ 220.89గా ఉంది.

కొలంబోలో భారత్ vs పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్.. తేదీని ప్రకటించిన ఐసీసీ.. ఎప్పుడంటే..?

వైభ‌వ్ సూర్యవంశీలాగానే తాను ఉన్న‌త స్థాయిలో రాణించాల‌ని అనుకుంటున్న‌ట్లు రాజ్ చెప్పాడు.

‘నేను వైభ‌వ్ భాయ్‌తో మాట్లాడిన ప్ర‌తిసారీ నాకు ఓ ప్ర‌త్యేక అనుభూతి క‌లుగుతుంది. మేము చిన్న‌ప్పుడు క‌లిసి ఆడుకునేవాళ్లం. అత‌డు త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేను కూడా అత‌డి అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తాను.’ అని రాజ్ న్యూస్‌18కి చెప్పాడు.

WTC 2025 Prize Money : ద‌క్షిణాఫ్రికాకు ప్రైజ్‌మ‌నీగా 30 కోట్ల‌కు పైనే.. ర‌న్న‌ర‌ప్ ఆస్ట్రేలియాతో పాటు భార‌త్‌, పాకిస్థాన్‌ల‌కు ఎంతంటే..?

రాజ్ తండ్రి ఓ మాజీ క్రికెట‌ర్‌. అత‌డు కూడా టీమ్ఇండియా త‌రుపున ఆడాల‌ని క‌ల‌లు క‌న్నాడు. అయితే దాన్ని సాధించ‌లేక‌పోయాడు. ఇప్పుడు కొడుకు రాజ్ టీమ్ఇండియాకు ఆడాల‌ని కోరుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే కొడుకు కావాల్సిన మ‌ద్ద‌తు ఇస్తున్నాడు. ఇక తండ్రి క‌ష్టాన్ని అర్థం చేసుకున్న రాజ్‌.. ఆయ‌న కోరిక నేర్చవాల‌ని భావిస్తున్నాడు.