WTC 2025 Prize Money : దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీగా 30 కోట్లకు పైనే.. రన్నరప్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్‌లకు ఎంతంటే..?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది

Rs 30 Crore Prize Money to South Africa
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గదను సొంతం చేసుకుంది. తొలిసారి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన సఫారీలు టెస్టు ఛాంపియన్ షిప్ గదతో పాటు ప్రైజ్‌మనీ కింద రూ.30.78 కోట్లు నగదును సొంతం చేసుకున్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ.18.6 కోట్లు దక్కాయి.
ఇక డబ్యూటీసీ 2023-25 సైకిల్‌లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టు భారీగానే ప్రైజ్‌మనీ అందనుంది. రూ.12.3 కోట్లు టీమ్ఇండియా అందుకోనుంది. అదే విధంగా నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు రూ.10.26 కోట్లు, ఐదో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌కు రూ.8.21 కోట్లు, ఆరో స్థానంలో నిలిచిన శ్రీలంకకు రూ.7.18 కోట్లు ప్రైజ్‌మనీగా లభించనున్నాయి.
WTC final 2025 : డబ్ల్యూటీసీ విజేతగా దక్షిణాఫ్రికా.. ఫైనల్‌లో ఆసీస్ పై ఘన విజయం..
అయితే.. పాకిస్థాన్ మాత్రం వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల కంటే చాలా తక్కువ మొత్తానే అందుకోనుంది. ఎందుకంటే డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో పాక్ పేలవ ప్రదర్శననే అందుకు కారణం. ఈ సైకిల్‌లో ఏడో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ రూ.6.1 కోట్లు, ఎనిమిదో స్థానంలో నిలిచిన వెస్టిండీస్ రూ.5.13 కోట్లు అందుకోనుండగా తొమ్మిదో స్థానంలో నిలిచిన పాక్‌కు రూ.4.1 కోట్లు మాత్రమే లభిస్తాయి.
డబ్ల్యూటీసీ 2023-25 ప్రైజ్‌మనీ వివరాలు..
* దక్షిణాఫ్రికాకు – రూ 30.78 కోట్లు
* ఆస్ట్రేలియాకు – రూ 18.6 కోట్లు
* భారత్‌కు – రూ 12.31 కోట్లు
* న్యూజిలాండ్ – రూ 10.26 కోట్లు
ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. టీమ్ఇండియా ఓపెనర్లు ఫిక్స్.. బీసీసీఐ చెప్పేసింది..
* ఇంగ్లాండ్‌కు – రూ 8.21 కోట్లు
* శ్రీలంక – రూ 7.18 కోట్లు
* బంగ్లాదేశ్ – రూ 6.15 కోట్లు
* వెస్టిండీస్ – రూ 5.13 కోట్లు
* పాకిస్థాన్ – రూ 4.10 కోట్లు