ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. టీమ్ఇండియా ఓపెనర్లు ఫిక్స్.. బీసీసీఐ చెప్పేసింది..
భారత్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది.

India tour of england BCCI confirms Indias openers for ENG Tests
భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అతడి స్థానంలో ఎవరు ఓపెనర్‌గా వస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశస్వి జైస్వాల్‌కు తోడుగా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రావడం ఖాయమైంది.
బెకెన్‌హామ్‌లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమ్‌ఇండియా, ఇండియా-ఏ జట్ల మధ్య జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియోలో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు మైదానంలో అడుగుపెట్టారు.
కాగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ గైర్హాజరీలో కూడా యశస్వి జైస్వాల్‌కు తోడుగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా మైదానంలోకి దిగిన సంగతి తెలిసిందే.
Day 1 ✅
Prasidh Krishna wraps up the opening day of the intra-squad game in Beckenham 🏏
WATCH 🎥🔽 #TeamIndia | #ENGvIND | @prasidh43
— BCCI (@BCCI) June 14, 2025
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమ్ఇండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌తోనే భారత్, ఇంగ్లాండ్ జట్ల డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది.
Aiden Markram : వామ్మో.. ఒక్క శతకంతో మార్‌క్రమ్ మామ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో తెలుసా?
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్ 24 వరకు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వరకు – లార్డ్స్
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కెన్నింగ్టన్ ఓవల్