MCC : బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర ప‌ట్టే క్యాచ్‌ల‌ విష‌యంలో న్యూ రూల్.. ఇక నుంచి అలా క్యాచ్‌ ప‌డితే నాటౌట్‌..

బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర క్యాచ్‌ల‌ విష‌యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) లు కొత్త రూల్స్‌ను తీసుకురానున్న‌ట్లు స‌మాచారం.

MCC : బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర ప‌ట్టే క్యాచ్‌ల‌ విష‌యంలో న్యూ రూల్.. ఇక నుంచి అలా క్యాచ్‌ ప‌డితే నాటౌట్‌..

MCC makes major changes to law on boundary catches

Updated On : June 14, 2025 / 2:57 PM IST

బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర ప‌ట్టే క్యాచ్‌ల‌ విష‌యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) లు కొత్త రూల్స్‌ను తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. బౌండ‌రీ లైన్ దాటి వెళ్లి బంతిని పుష్ చేస్తూ ప‌ట్టే బ‌న్నీ హాఫ్ క్యాచ్‌లు ఇక నుంచి చెల్ల‌వు. అయితే.. బౌండ‌రీ లోప‌ల నుంచి బంతిని నెట్టి, ఆపై బ‌య‌టికి వెళ్లి, తిరిగి డైవ్ చేసి క్యాచ్‌ను అందుకుంటే మాత్రం దాన్ని క్యాచ్‌గానే ప‌రిగ‌ణించ‌నున్నారు.

ఊదాహ‌ర‌ణ‌కు.. 2023లో బిగ్‌బాష్ లీగ్ లీగ్‌లో మైఖేల్ నేస‌ర్‌.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద క్యాచ్ అందుకున్నాడు. అయితే.. బ్యాలెన్స్ కోల్పోతుండ‌డంతో బంతిని గాల్లోకి ఎగ‌ర‌వేశాడు. ఆపై అత‌డు బౌండ‌రీ లైన్ దాటి వెళ్లాడు. అక్క‌డ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుని మ‌రోసారి గ్రౌండ్‌లోకి నెట్టాడు. ఆపై మైదానంలోకి జంప్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాట‌ర్ ఔట్ అయ్యాడు. ఈ క్యాచ్ పై అప్ప‌ట్లో తీవ్ర దుమారం రేగింది. ఈ క్ర‌మంలోనే ఎంసీసీ బ‌న్నీ హాప్స్ క్యాచ్‌ను ఇల్లీగ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

WTC Final 2025 : ద‌క్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ వార్నింగ్‌.. ఒక్క వికెట్ తీస్తే చాలు..

కాగా.. బౌండరీ లోపల నుంచి బంతిని పైకి నెట్టి, బయటికి వెళ్లి, ఆపై డైవ్ చేసి క్యాచ్ పట్టేందుకు అనుమతి ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు హార్లీన్ డియోల్ ప‌ట్టిన‌ట్లుగా ప‌డితే అది క్యాచ్ కింద‌నే ప‌రిగ‌ణిస్తారు.

Aiden Markram : వామ్మో.. ఒక్క శ‌త‌కంతో మార్‌క్ర‌మ్ మామ ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడో తెలుసా?

‘బన్నీ-హాప్స్ క్యాచ్‌లను తీసివేశాము. బౌండరీ లోపల నుంచి బంతిని పైకి నెట్టి, బయటికి వెళ్లి, ఆపై డైవ్ చేసి క్యాచ్ పట్టేందుకు అనుమతి ఉంది. ఒకవేళ బంతిని వేరే ఫీల్డర్‌కు పంపినా లేదా మైదానంలోకి నెట్టినా.. ఫీల్డర్ బౌండరీ బయట ల్యాండ్ అయితే.. లేదా ఆ తర్వాత బయటికి వెళితే.. దాన్ని బౌండరీ కింద పరిగణిస్తారు.’ అని ఎంసీసీ తెలిపింది.

అంటే.. బౌండరీ బయట నుండి గాల్లోకి ఎగిరి బంతిని తాకడానికి ఫీల్డర్‌కు ఒకే ఒక్క అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ బౌండరీ లైన్ దాటి వెళ్లొద్దు.

ఈ కొత్త రూల్ ఈ నెలలోనే ఐసీసీ ప్లేయింగ్ కండిషన్‌లో భాగం కానుంది. వచ్చేఏడాది అక్టోబర్ నుంచి ఎంసీసీ అమలు చేయనుంది.