WTC Final 2025 : ద‌క్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ వార్నింగ్‌.. ఒక్క వికెట్ తీస్తే చాలు..

ప్ర‌స్తుత ఉన్న ప‌రిస్థితుల్లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించాలి అంటే ఏదైన అద్భుతం జ‌ర‌గాల్సిందే.

WTC Final 2025 : ద‌క్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ వార్నింగ్‌.. ఒక్క వికెట్ తీస్తే చాలు..

WTC Final 2025 Australia assistant coach warning to South Africa

Updated On : June 14, 2025 / 2:22 PM IST

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం దిశ‌గా ద‌క్షిణాఫ్రికా దూసుకువెలుతోంది. మ‌రో 69 ప‌రుగులు చేస్తే తొలిసారి డ‌బ్ల్యూటీసీ ట్రోఫీని స‌ఫారీలు ముద్డాడుతారు. అదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా 8 వికెట్లు తీస్తే విజ‌యం సాధిస్తుంది. మ‌రో రెండు రోజులు ఆట మిగిలి ఉండ‌డంతో ఈ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌డం ఖాయం.

ఐడెన్ మార్‌క్ర‌మ్ (102), కెప్టెన్ టెంబా బ‌వుమా (65) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుత ఉన్న ప‌రిస్థితుల్లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించాలి అంటే ఏదైన అద్భుతం జ‌ర‌గాల్సిందే. ఇలాంటి స‌మ‌యంలో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియ‌ల్ వెటోరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Aiden Markram : వామ్మో.. ఒక్క శ‌త‌కంతో మార్‌క్ర‌మ్ మామ ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడో తెలుసా?

‘ఫైన‌ల్ మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు. ఆసీస్ గెలిచేందుకు ఇంకా అవ‌కాశం ఉంది. ఒక్క వికెట్ ప‌డితే చాలు. ఏదైన జ‌ర‌గొచ్చు. ప్ర‌స్తుతం మార్‌క్ర‌మ్, బ‌వుమాలు ఇద్ద‌రూ మ్యాచ్‌ను త‌మ నియంత్ర‌ణ‌లో ఉంచుకున్నారు. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఔటైతే.. కొత్త బ్యాట‌ర్ క్రీజులో అడుగుపెడితే అప్పుడు ప‌రిస్థితి ఇంకో ర‌కంగా ఉంటుంది.’ అని వెటోరి అన్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 212 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత తొలి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా 138 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆసీస్‌కు 74 ప‌రుగుల కీల‌క తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

WTC Final 2025 : ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్న ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌.. మ్యాచ్ నుంచి కీల‌క ప్లేయ‌ర్ ఔట్‌..

అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌ 207 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం క‌లుపుకుంటే ద‌క్షిణాఫ్రికా ముందు 282 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ద‌క్షిణాప్రికా రెండు వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగులు చేసింది. స‌ఫారి విజ‌యానికి మ‌రో 69 ప‌రుగులు అవ‌స‌రం.