కొలంబోలో భారత్ vs పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్.. తేదీని ప్రకటించిన ఐసీసీ.. ఎప్పుడంటే..?
క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ తేదీని కూడా ప్రకటించింది.

India vs Pakistan match
Womens ODI World Cup 2025: క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ తేదీని కూడా ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరు దేశాల మధ్య జరగనున్న తొలి క్రికెట్ మ్యాచ్ ఇదే.
మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్-2025 మెగాటోర్నీ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 2వ తేదీ వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌లకు భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు మొత్తం 31 మ్యాచ్ లు ఆడనున్నాయి. అయితే, ఒప్పందం ప్రకారం.. 2024-2027 సంవత్సరాల కాలంలో ఐసీసీ ఈవెంట్లలో ఇరుదేశాలు (భారత్, పాకిస్థాన్) ఆతిధ్యమిచ్చే టోర్నీల్లోని మ్యాచ్ లు తటస్థ వేదికపై జరగుతాయి. అంటే.. మహిళల వన్డే ప్రపంచ కప్‌లోని అన్ని మ్యాచ్‌లను పాకిస్థాన్ శ్రీలకంలోని కొలంబో వేదికగా ఆడనుంది.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య అక్టోబర్ 5వ తేదీన కొలంబో వేదికగా మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇదిలాఉంటే ఈ మెగా టోర్నీలో భారతదేశంలో జరిగే మ్యాచ్‌లు ఎం. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఎసిఎ స్టేడియం (గువహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఎసిఎ-విడిసిఎ స్టేడియం (విశాఖపట్నం)లో జరగనున్నాయి. అదేవిధంగా శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లు ఆర్. ప్రేమదాస స్టేడియం (కొలంబో)లో జరుగుతాయి. ఈ వరల్డ్ కప్‌లో భారతదేశంతోపాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్టు ఆడనున్నాయి.
పాకిస్తాన్ ఫైనల్ కు చేరితే..?
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంటే, అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది, ఆ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరితే, టైటిల్ పోరు కూడా అక్కడే జరుగుతుంది. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకోకపోతే, మొదటి సెమీఫైనల్ గౌహతిలో, ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది.
ప్రపంచ కప్‌లో భారత జట్టు షెడ్యూల్
సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – బెంగళూరు – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 5: ఇండియా vs పాకిస్తాన్ – కొలంబో – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 9: ఇండియా vs దక్షిణాఫ్రికా – వైజాగ్ – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 12: ఇండియా vs ఆస్ట్రేలియా – వైజాగ్ – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 19: ఇండియా vs ఇంగ్లాండ్ – ఇండోర్ – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 23: ఇండియా vs న్యూజిలాండ్ – గౌహతి – మధ్యాహ్నం 3 గంటలకు
అక్టోబర్ 26: ఇండియా vs బంగ్లాదేశ్ – బెంగళూరు – మధ్యాహ్నం 3 గంటలకు
🚨 India’s Cricket World Cup 2025 schedule
▶️ Opening game against Sri Lanka in Bengaluru
▶️ 2️⃣x Bengaluru & Vishakapatnam, 1️⃣ each in Indore & Guwahati
▶️ Pakistan match in Colombo#CricketWorldCup pic.twitter.com/f8mujqC5hZ— Women’s CricZone (@WomensCricZone) June 16, 2025