చిల్డ్రన్స్ డే స్పెషల్ : అభిమాని కుమార్తె అన్నప్రాసనకు ధోని

  • Published By: sreehari ,Published On : November 14, 2019 / 11:41 AM IST
చిల్డ్రన్స్ డే స్పెషల్ : అభిమాని కుమార్తె అన్నప్రాసనకు ధోని

Updated On : November 14, 2019 / 11:41 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమాని కుమార్తెకు  అన్నం తినిపించాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా అన్నప్రాసన రోజున తొలిసారి పాపకు ధోని అన్నం తినిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ చిన్నారిని తన చేతుల్లోకి పట్టుకుని స్పూన్‌తో ఆహారం అందించాడు. సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఆరు నెలల చిన్నారులకు అన్నప్రాసన చేస్తుంటారు. 

ఇందులో పిల్లల మేనమామలే తొలిసారి అన్నం తినిపిస్తుంటారు. ధోని కూడా  తన అభిమాని కుమార్తెకు  మేనమామలా మారి పాయసం తినిపించాడు. ఈ వీడియోలో రుచి ఎలా ఉందని అడిగితే.. పాప మాత్రమే ఆ రుచి ఎలా ఉందో చెప్పగలదు అని ధోని సమాధాన మిచ్చాడు.

ధోని పాపకు ఆహారం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె డాడీ ఆలోచనను అంగీకరిస్తున్నాం. చిన్నారి కచ్చితంగా ఎంతో అదృష్టవంతురాలు.. అని వీడియోలో ఒకరి వాయిస్ వినిపిస్తోంది. 

ఇటీవల రాంచీలోని JSCA అంతర్జాతీయ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా జరిగిన మూడో టెస్టు సమయంలో ధోనీ కనిపించాడు. ఈ సందర్భంగా ఆఫ్ సిన్నర్ షబాజ్ నదీమ్‌తో ధోని మాట్లాడుతున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుతం.. క్రికెట్ కు బ్రేక్ ఇచ్చాడు. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి ధోని క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.