Shubman Gill : పోస్టర్ కూడా వేశారు కదా.. ఈ రోజు గిల్ ఎందుకు ఆడడం లేదు ?
విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింతో మ్యాచ్‌లో పంజాబ్ తుది జట్టులో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) లేడు.
Vijay Hazare Trophy Why is Shubman Gill not playing for Punjab vs Sikkim match
- పంజాబ్ వర్సెస్ సిక్కిం మ్యాచ్
- పంజాబ్ తుది జట్టులో లేని గిల్
- షాక్‌లో అభిమానులు
Shubman Gill : ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్. ప్రస్తుతం అతడు కోలుకున్నాడు. న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందే అతడు మైదానంలో దిగి ఫామ్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నేడు (శనివారం జనవరి 3) విజయ్ హజారే ట్రోఫీలో ఆడాల్సి ఉంది.
పంజాబ్ తరుపున సిక్కింతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం జైపూర్‌కు చేరుకున్న గిల్ ప్రాక్టీస్ సైతం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్‌కు 90 నిమిషాల ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కూడా తమ సోషల్ మీడియాలోనూ మ్యాచ్ గురించి పోస్ట్ చేసింది. ఇందులో శుభ్‌మన్ గిల్ ఫోటోను ఉపయోగించడం గమనార్హం.
MATCH DAY 🏏
Punjab returns to the field with confidence after a win in the last game, taking on Sikkim in the Vijay Hazare Trophy.
📍 Jaipuria Vidhyalaya Ground, Jaipur
🗓 Saturday, 3 January 2026
⏰ 9:00 AM ISTSame intent. Fresh challenge. 💛💙#MatchDay #PunjabCricket #PCA… pic.twitter.com/c5He6mxzTj
— Punjab Cricket Association (@pcacricket) January 3, 2026
తీరా మ్యాచ్ ప్రారంభం అయ్యాక చూస్తే శుభ్‌మన్ గిల్ తుది జట్టులో కనిపించడం లేదు. అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకు గిల్ ఆడడం లేదని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఈ రోజు గిల్ ఆడకపోవడానికి స్పష్టమైన కారణం అయితే తెలియదు.
కివీస్‌తో వన్డే సిరీస్ కోసం సెలక్టర్లు ఈ రోజు లేదా రేపు జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో సెలక్టర్లతో సమావేశం కావడం కోసమే గిల్ మ్యాచ్ ఆడడం లేదని అంటున్నారు.
