‘రాయుడు కంటే శంకర్ బెటర్’ రవిశాస్త్రి కామెంట్: నిజాలు దేవుడికెరుక

‘రాయుడు కంటే శంకర్ బెటర్’ రవిశాస్త్రి కామెంట్: నిజాలు దేవుడికెరుక

Updated On : April 25, 2019 / 2:44 PM IST

టీమిండియా హెడ్ కోచ్ సాధారణంగానే విమర్శల్లో చిక్కుకోవడం ఇది ప్రథమం కాదు.  నెటిజన్ల ట్రోలింగ్ ఎదుర్కోవడం కొత్తేం కాదు. వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపిక అనంతరం ఇది మరింత తీవ్రమైంది. అంబటి రాయుడు, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లను 15మంది ప్లేయర్ల జాబితాలో తీసుకోకపోవడంపై రాయుడు అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. 

ఈ క్రమంలోనే విజయ్ శంకర్ పేజిని ఎడిట్ చేసి మరీ.. రవిశాస్త్రిని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. రాయుడు కంటే విజయ్ శంకరే బెటర్ అని రవిశాస్త్రి తాగి చెప్పాడు అని వికీపిడియా పేజిలో రాశాడు. పైగా అప్పుడు కోచ్ ఫుల్లుగా తాగి ఉన్నాడని విజయ్ శంకర్ తన పేజిలో రాసుకున్నట్లుగా ఉంది. పెట్టిన 6నిమిషాల్లోనే స్క్రీన్ షాట్‌లు వైరల్‌గా మారాయి. దానిని గమనించి వెంటనే ఆ లైన్లను తొలగించారు. మే 25వరకూ పేజీ మార్పులపై నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

టీమిండియాలో 4వ స్థానం కోసం కొద్ది నెలల పాటు శ్రమించిన సెలక్టర్లు విజయ్ శంకర్‌ను ఆల్ రౌండర్‌గా పరిగణిస్తూ రాయుడుకు బదులుగా అతనికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత మళ్లీ ఆటగాళ్లకు గాయమై జట్టుకు దూరం కావచ్చు. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు అవకాశం వస్తే ఆడేందుకు సిద్ధంగా ఉండాలని కోచ్ రవిశాస్త్రి సెలక్ట్ కాని ప్లేయర్లకు సూచించారు.