IPL 2023: ఉప్పల్‌లో గౌతమ్ గంభీర్‌ను టార్గెట్ చేసిన అభిమానులు.. కోహ్లి కోహ్లి అంటూ..
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ మధ్యలో అభిమానుల కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఆటగాళ్లపై కొందరు అభిమానులు నాణేలు లాంటివి విసిరివేసినట్లు తెలుస్తోంది.

Gautam Gambhir
Virat Kohli-Gautam Gambhir: ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ మధ్యలో అభిమానుల కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఆటగాళ్లపై కొందరు అభిమానులు నాణేలు లాంటివి విసిరివేసినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు కలగజేసుకుని ఫ్యాన్స్‌కు సర్ది జెప్పారు. ఈ క్రమంలో మ్యాచ్‌కు కాసేపు ఆటంకం కలిగింది. అనంతరం మ్యాచ్‌ను కొనసాగించారు.
గౌతమ్ గంభీర్ ను టార్గెట్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్..
ఇదిలా ఉంటే.. ఇటీవల విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం దీన్ని మరిచిపోవడం లేదు. ముఖ్యంగా లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ కనిపించినప్పుడు విరాట్ అభిమానులు అతడికి కోపం తెప్పించే పని చేస్తున్నారు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సైతం గంభీర్ కనిపించగా కోహ్లి కోహ్లి అంటూ మైదానంలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. దీంతో గంభీర్ కాస్త అసహనంగా కనిపించాడు.
Virat Kohli: గంభీర్‌తో గొడవ.. మరుసటి రోజు భార్యతో కలిసి విరాట్ ఏం చేశాడంటే..?
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లక్నో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి 27, 353 మంది క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు.