Virat Kohli : సౌతాఫ్రికా ఫ్లేయర్ డీన్ ఎల్గర్ ఔటైన తరువాత అద్భుత వీడ్కోలు పలికిన కోహ్లీ.. వీడియో వైరల్

సౌతాఫ్రికా ప్లేయర్ ఎల్గన్ క్యాచ్ తీసుకున్న కోహ్లీ సంబురాలు చేసుకోకుండా అతనికి ఘనంగా వీడ్కోలు పలికాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Virat Kohli

IND vs SA 2nd Test : కేప్‌టౌన్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లు సత్తాచాటారు. ఫలితంగా ఒకేరోజు 23 వికెట్లను పడగొట్టారు. 122 ఏళ్లలో టెస్టు మ్యాచ్ తొలిరోజు పడిన అత్యధిక వికెట్లు ఇవే కావటం గమనార్హం. బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.

Also Read : Mohammed Siraj : సౌతాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంపట్ల సిరాజ్ ఏమన్నారో తెలుసా?

దక్షిణాఫ్రికా స్టాండ్ -ఇన్ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఈ మ్యాచ్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అవుతున్నాడు. ఇండియా – భారత్ మధ్య కేప్ టౌన్ లో తొలి ఇన్నింగ్స్ లో ఎల్గర్ కేవలం నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో ఔట్ అయ్యాడు. ఎల్గర్ క్యాచ్ ను విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీ అతనికి అద్భుత వీడ్కోలు పలుకుతూ సజ్ఞలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : South Africa Vs India 2nd Test Updates : 122 ఏళ్లలో ఇదే తొలిసారి.. కేప్‌టౌన్‌ టెస్టులో అనేక రికార్డులు.. రోహిత్ శర్మ ధోనీ సరన నిలుస్తాడా?

విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా ప్లేయర్ ఎల్గర్ క్యాచ్ తీసుకున్న తరువాత అతనివైపు చూస్తూ సలాం చేస్తున్నట్లుగా చేతులతో సజ్ఞలు చేశాడు. ఆ తరువాత ఎల్గర్ పెవిలియన్ కు వెళ్తున్న క్రమంలో బుమ్రా వెళ్లి అతన్ని అభినందించారు. ఆ తరువాత కోహ్లీ పరుగెత్తుకుంటూ వెళ్లి ఎల్గర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ముఖేష్ కుమార్ అతనివద్దకు వెళ్లి షేక్ హ్యాడ్ ఇచ్చి వీడ్కోలు పలికాడు. కోహ్లీ, ఇతర టీమిండియా సభ్యులు ఎల్గర్ పెవిలియన్ కు వెళ్తుండగా వీడ్కోలు పలికిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.