Virat Kohli : ఉప్పల్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. కోహ్లీ నామస్మరణతో మార్మోగిన స్టేడియం
మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడకపోయినప్పటికీ తొలి రోజు ఆటలో అతడి నామస్మరణతో స్టేడియం ఊగిపోయింది.

Virat Kohli chants erupt in stadium as Hyderabad crowd misses star batter
Kohli : ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య గురువారం ఉప్పల్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడకపోయినప్పటికీ తొలి రోజు ఆటలో అతడి నామస్మరణతో స్టేడియం ఊగిపోయింది.
వాస్తవానికి ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీకి ఎంపిక అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో అతడు తొలి రెండు టెస్టులు ఆడడం లేదని మ్యాచ్‌కు రెండు రోజుల ముందు బీసీసీఐ వెల్లడించింది. దీంతో ఉప్పల్‌లో కోహ్లీని చూద్దామని వచ్చిన ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. కోహ్లీ పై తమకు ఉన్న అభిమానాన్ని మరో రూపంలో చాటారు. అతడు ఆడకపోయినప్పటికీ కూడా అతడి నామస్మరణతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది.
తమ ఆరాధ్య దైవం విరాట్ కోహ్లీని ఎంతో మిస్ అవుతున్నామని కొందరు ఫకార్లు, కోహ్లీ ఫోటోలు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Ravichandran Ashwin : చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. ఒకే ఒక్క భారతీయుడు
ఉప్పల్ మైదానం కోహ్లీకి బాగా అచ్చొచ్చింది. 2017లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచులో ఇక్కడ కోహ్లీ ద్విశతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో విజయం సాధించించింది.
ఇక నేటి మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్ (70; 88 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకం చేయగా జానీ బెయిర్ స్టో (37), బెన్‌డకెట్ (35), జో రూట్ (29)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా లు చెరో మూడు వికెట్లు తీయగా జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
? Hyderabad misses you, King. #ViratKohli #INDvENG #INDvsENG #TeamIndia #BharatArmy #COTI?? pic.twitter.com/TgFcbRrWjd
— The Bharat Army (@thebharatarmy) January 25, 2024