Virat Kohli : ఒక్క పోస్టుకు రూ. 5 కోట్లు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఆటలోనే కాకుండా..సంపాదనలో అదరగొట్టేస్తున్నారు. వ్యాపార ప్రచారం కోసం పలు కంపెనీలకు బ్రాడ్ అంబాసిడర్ గా, వ్యాపార ప్రకటనల్లో ఇతను కనిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏదైనా వ్యాపార ప్రచారం కోసం చేసే ఒక్కో పోస్టుకు రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని తేలింది.

Virat Kohli : ఒక్క పోస్టుకు రూ. 5 కోట్లు

Kohli

Updated On : July 3, 2021 / 6:20 AM IST

Virat Kohli Instagram : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఆటలోనే కాకుండా..సంపాదనలో అదరగొట్టేస్తున్నారు. వ్యాపార ప్రచారం కోసం పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా, వ్యాపార ప్రకటనల్లో ఇతను కనిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏదైనా వ్యాపార ప్రచారం కోసం చేసే ఒక్కో పోస్టుకు రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని తేలింది. క్రికెటర్లలో ఇతనే అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని యూకేకు చెందిన హాపర్ హెచ్ క్యూ సంస్థ వెల్లడించింది. 2021 గాను ఈ సంస్థ ప్రకటించిన ఇన్ స్ట్రా గ్రామ్ ధనవంతుల జాబితాలో కోహ్లీ 19వ స్థానంలో నిలిచారు.

కోహ్లీ..సోషల్ మీడియాను తరచూ ఉపయోగిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇతని ఇన్ స్ట్రా గ్రామ్ ను 132 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఈ జాబితాలో ఫుట్ బాల్ దిగ్గజం ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నారు. ఇతను ఒక్కో పోస్టుకు దాదాపు రూ. 11 కోట్లు తీసుకుంటున్నారని ఈ సంస్థ వెల్లడించింది. ఇతడిని 300 మిలియన్లకు పైగా అనుసరిస్తున్నారు. మరో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి రూ. 8.6 కోట్లతో ఏడో స్థానంలో నిలిచారు.