Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. భారత్ క్రికెటర్‌గా ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి కోహ్లీనే ..

విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫార్మాట్‌లో సరికొత్త ఘనత సాధించాడు. అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Virat Kohli: ఐపీల్ (IPL 2023) 16 సీజన్ ప్రారంభమైంది. ఒక్కో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. సాయంత్రం అయితే చాలు క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతున్నారు. అంతలా టీంల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. ఆదివారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)  మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తడబడుతూ ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులతో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) (82 నాటౌట్), డూప్లెసిస్ (73) అద్భుత ఆటతీరును కనబర్చి రాయల్ ఛాలెంజర్స్ కు సునాయాసంగా విజయాన్ని అందించారు.

IPL 2023: ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా 11వ సారి సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్

కోహ్లీ కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 50 అర్థ శతకాలు సాధించిన తొలి భారత క్రికెటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, భారత్ క్రికెటర్లలో కోహ్లీ తొలి స్థానంలో ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో 49 అర్థ శతకాలతో శిఖ ధావన్ మూడవ స్థానంలో నిలిచాడు.

 

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన వారిలో మొదటి మూడు స్థానాల్లో వార్నర్ (60), విరాట్ కోహ్లీ (50), ధావన్ (49) ఉండగా.. నాలుగు, ఐదు స్థానాల్లో ఏబీ డివిలియర్స్ (43), రోహిత్ శర్మ (41) నిలిచారు.

ట్రెండింగ్ వార్తలు