Virat Kohli : టీమ్ఇండియాతో తిరువనంతపురం వెళ్లని కోహ్లీ..! ముంబైకి ఎందుకు వెళ్లాడు..?
నెదర్లాండ్స్‌తో ఆడనున్న రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. అయితే.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం జట్టుతో లేడు.
![Virat Kohli : టీమ్ఇండియాతో తిరువనంతపురం వెళ్లని కోహ్లీ..! ముంబైకి ఎందుకు వెళ్లాడు..? Virat Kohli : టీమ్ఇండియాతో తిరువనంతపురం వెళ్లని కోహ్లీ..! ముంబైకి ఎందుకు వెళ్లాడు..?](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-8-1.jpg)
Virat Kohli Leaves The Team Camp
Virat Kohli Leaves The Team Camp : దాదాపు 12 ఏళ్ల తరువాత స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ ( ODI World Cup) విజేతగా టీమ్ఇండియా నిలవాలని సగటు భారత క్రీడాభిమాని కోరుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అక్టోబర్ 8న టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇంతకంటే ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. గౌహతి వేదికగా ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మొదటి వార్మప్ మ్యాచ్ రద్దైంది. నెదర్లాండ్స్‌తో ఆడనున్న రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. అయితే.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం జట్టుతో లేడు.
మొదటి వార్మప్ మ్యాచ్ రద్దు అయిన తరువాత మేనేజ్మెంట్ అనుమతితో విరాట్ కోహ్లీ ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే విరాట్ కోహ్లీ ముంబైకి వెళ్లినట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో తెలిపింది. సోమవారం తిరిగి విరాట్ కోహ్లీ టీమ్ఇండియాతో కలవనున్నట్లు పేర్కొంది.
రెండో సారి తల్లికాబోతున్న అనుష్క..!
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ రెండోసారి తల్లికాబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ముంబైకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021 జనవరి 11న వామిక జన్మించింది. కాగా.. త్వరలోనే విరుష్క జంట శుభవార్త చెప్పడం ఖాయమంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ODI World Cups : వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
ఇక మంగళవారం తిరువనంతపురంలో జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. మొదటి వార్మప్ మ్యాచ్‌లాగానే రెండో మ్యాచ్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ఇండియాకు వార్మప్ మ్యాచుల ద్వారా ప్రాక్టీస్ లభిస్తుందని అనుకుంటే అందుకు వరుణుడు అడ్డుతగులుతున్నాడు.