Virat Kohli New Record: సచిన్ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ.. అత్యంత వేగంగా 25వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు ..
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 25వేల పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా గుర్తింపు పొందటంతోపాటు తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 25వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

Virat Kohli
Virat Kohli New Record: క్రికెట్‌లో రికార్డుల రారాజుగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. పనిలో పనిగా సచిన్ రికార్డునుసైతం బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 25వేల పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా గుర్తింపు పొందటంతో పాటు తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 25వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. గతంలో అతితక్కువ ఇన్నింగ్స్ లో 25వేల పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ టెండుల్కర్ 577 ఇన్నింగ్స్‌లో 25వేల పరుగులు సాధించాడు. తాజాగా కోహ్లీ 549 ఇన్నింగ్స్ లోనే 25వేల పరుగుల మార్క్ కు చేరుకున్నాడు. వీరి తరువాత స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీపాంటింగ్ ఉన్నాడు. రికీపాంటింగ్ 588 ఇన్నింగ్స్ లో 25వేల పరుగుల క్లబ్ లో చేరాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 25వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. లైయన్ వేసిన 12 ఓవర్లో ఫోర్, ఆ తరువాత సింగిల్ తీయడం ద్వారా 25వేల పరుగులు చేసిన 6వ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కంటే ముందు.. ఐదుగురు ఆటగాళ్లు 25వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు. వీరిలో అత్యధిక పరుగులు చేసిన వారిలో ముందు వరుసలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ నిలిచాడు. సచిన్ మొత్తం 782 ఇన్నింగ్స్‌లలో 34,357 పరుగులు చేయగా, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్‌ల్లో 28,016 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీపాంటింగ్ 688 ఇన్నింగ్స్ ల్లో 27,483 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే 725 ఇన్నింగ్స్‌ల్లో 25,957 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్ కలిస్ 617 ఇన్నింగ్స్‌ల్లో 25,534 పరుగులు చేశాడు. ప్రస్తుతం 25వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. 549 ఇన్నింగ్స్‌లో 25,012 పరుగులతో ఈ ఘనత సాధించాడు.
????????? ????????! ?
Congratulations @imVkohli on reaching 2️⃣5️⃣0️⃣0️⃣0️⃣ international runs in international cricket! ?
Simply sensational ????#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Ka4XklrKNA
— BCCI (@BCCI) February 19, 2023