గుడ్ బై.. Virat Kohli మరో సంచలన నిర్ణయం

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్

గుడ్ బై.. Virat Kohli మరో సంచలన నిర్ణయం

Virat Kohli

Updated On : September 20, 2021 / 11:39 AM IST

Virat Kohli : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కోహ్లి చేసిన వ్యాఖ్యలను ఆర్‌సీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Viral Video : ఈ వీడియో చూస్తే ఇంక బేకరీ ఫుడ్ తినరు–పిచ్చి చేష్టలు చేస్తున్న బేకరి వర్కర్లు

”కెప్టెన్‌గా నాకు ఇదే చివరి ఐపీఎల్‌. ఐపీఎల్‌ 2021 సీజన్‌ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఇకపై ఆర్‌సీబీ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతా. ఇక చివరి వరకు ఆర్‌సీబీతోనే నా ప్రయాణం ఉండే అవకాశం ఉంది. ఇంతకాలం నాకు సపోర్ట్‌ చేసిన అభిమానులకు, ఆర్‌సీబీకి నా కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు కోహ్లి.

గత దశాబ్దకాలం నుంచి ఆర్సీబీ జట్టుకు కోహ్లి సారథ్యం వహిస్తున్నాడు. అయితే ప్రతి ఏడాది కప్పు మాదే అంటూ ఐపీఎల్ లో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఐపీఎల్ లో మూడుసార్లు ఫైనల్ చేరుకున్నప్పటికీ టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయింది.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

మరోవైపు టి20 ప్రపంచకప్‌ అనంతరం టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నట్లు కోహ్లి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒత్తిడిని తట్టుకోలేక సతమతం అవుతున్న కోహ్లీ తాజాగా ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో కోహ్లి ఇప్పటివరకు 199 మ్యాచ్‌ల్లో 6076 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.