వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తరువాత కోహ్లీ ఏం చేశాడో చూశారా? వీడియో వైరల్

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తరువాత టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తరువాత కోహ్లీ ఏం చేశాడో చూశారా? వీడియో వైరల్

Virat Kohli

Updated On : January 2, 2024 / 11:34 AM IST

Virat Kohli : భారత్ గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై ఓడిపోయిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో వరల్డ్ కప్ లోని వరుసగా 10 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. దీంతో 2023 వరల్డ్ కప్ టీమిండియాదే అని అందరూ భావించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు ఓడిపోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 765 పరుగులతో మెగాటోర్నీలో టాప్ బ్యాటర్ గా నిలిచాడు.

Also Read : దయచేసి నా ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ ఇవ్వండి.. వీడ్కోలు టెస్ట్‌కు ముందు డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తరువాత టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ ఓటమి తరువాత మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్లు మైదానాన్ని వీడుతున్నారు. ఆ సమయంలో కోహ్లీ తీవ్ర నిరాశగా కనిపించాడు. కోహ్లీ మైదానంలో సహచరులవైపు నడుస్తూ వికెట్ల వద్దకు రాగానే తన క్యాప్ తో స్టంప్ లను కొట్టడం వీడియోలో కనిపించింది.