Virat Kohli : కోహ్లి ఆ ప‌ని చేస్తే చూడాల‌ని ఉంద‌న్న టాలీవుడ్ హీరోయిన్‌

ప‌రుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Virat Kohli : కోహ్లి ఆ ప‌ని చేస్తే చూడాల‌ని ఉంద‌న్న టాలీవుడ్ హీరోయిన్‌

Virat Kohli winning IPL trophy is my only dream says Actress Varsha Bollamma

Updated On : February 29, 2024 / 9:29 PM IST

Virat Kohli -Varsha Bollamma : ప‌రుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరిలో సామాన్య‌లు నుంచి సినీ సెల‌బ్రెటీల వ‌ర‌కు ఉన్నారు. ఇక ఐపీఎల్‌లో ఒకే ప్రాంచైజీకి ఆడుతున్న ఏకైక క్రికెట‌ర్ విరాట్ కోహ్లినే కావ‌డం గ‌మ‌నార్హం. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)కి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

ఐపీఎల్ ఆరంభమై 16 సీజ‌న్లు దాటినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఆర్‌సీబీ క‌ప్పును ముద్దాడ‌లేదు. ఆర్‌సీబీకి ఐపీఎల్ టైటిల్ అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. అయితే.. కోహ్లి ఐపీఎల్ ట్రోఫిని అందుకోవ‌డం చూడ‌డ‌నే త‌న క‌ల అని టాలీవుడ్ హీరోయిన్ వ‌ర్ష బొల్ల‌మ్మ‌ తెలిపింది. తాను ఆర్‌సీబీకి డై హార్డ్ ఫ్యాన్ అని, కోహ్లి వ‌ల్లే తాను ఐపీఎల్ చూస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

BCCI : బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌తో లాభ‌మేంటి? ఇషాన్‌, అయ్య‌ర్‌లు కోల్పోయేది వీటినేనా?

‘ఊరు పేరు బైర‌వకోన’ అనే సినిమాలో ఆమె న‌టించింది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న క్ర‌మంలో ఆమెకు క్రికెట్ గురించి ప్ర‌శ్న ఎదురైంది. ఈ క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఆమె చెప్పింది. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి త‌న అభిమాన ప్లేయ‌ర్ అని చెప్పుకొచ్చింది. అత‌డి కోస‌మే తాను ఐపీఎల్ చూడ‌డం మొద‌లుపెట్టిన‌ట్లు తెలిపింది. కోహ్లి ఐపీఎల్ ట్రోఫిని అందుకోవ‌డం చూడ‌డ‌మే త‌న క‌ల అని, ఈ సారి (ఐపీఎల్ 2024) అది త‌ప్ప‌క నెర‌వేరుతుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పింది.

విరాట్ కోహ్లి గురించి హీరోయిన్ వ‌ర్ష బొల్ల‌మ్మ మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ప‌లువురు ఆర్‌సీబీ అభిమానులు స్పందించారు. మా క‌ల కూడా అదేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ 2024 సీజ‌న్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది.

KL Rahul : ఎన్‌సీఏలో ఓ ప్లాట్‌ కొనుక్కో.. కేఎల్ రాహుల్ పై నెటిజ‌న్ల సెటైర్లు

ఇదిలా ఉంటే.. వ‌ర్ష బొల్ల‌మ్మ న‌టించిన ఊరు పేరు బైర‌వకోన ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో సందీప్ కిష‌న్ హీరోగా న‌టించారు.