KL Rahul : ఎన్‌సీఏలో ఓ ప్లాట్‌ కొనుక్కో.. కేఎల్ రాహుల్ పై నెటిజ‌న్ల సెటైర్లు

మార్చి 7 నుంచి ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ నేడు (గురువారం) భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది.

KL Rahul : ఎన్‌సీఏలో ఓ ప్లాట్‌ కొనుక్కో.. కేఎల్ రాహుల్ పై నెటిజ‌న్ల సెటైర్లు

Fans react as KL Rahul is ruled out of 5th Test due to injury

Updated On : February 29, 2024 / 5:15 PM IST

మార్చి 7 నుంచి ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ నేడు (గురువారం) భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ దూరంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. అత‌డు గాయం నుంచి ఇంకా కోలుకోలేద‌ని త్వ‌ర‌లోనే అత‌డు లండ‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలిపింది.

హైద‌రాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అత‌డు తొడ కండ‌రాల గాయం బారిన ప‌డ్డాడు. దీంతో అత‌డు మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. ప్ర‌స్తుతం అత‌డు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నాడు. మూడో టెస్ట్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు అత‌డు 90 శాతం ఫిట్‌గా ఉన్నాడ‌ని ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ మూడో మ్యాచ్‌లో అత‌డు ఆడ‌లేదు. పోనీ నాలుగో టెస్టు అయినా ఆడ‌తాడు అనుకుంటే అదీ జ‌ర‌గ‌లేదు. క‌నీసం ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌లోనైనా అత‌డు ఆడ‌తాడ‌ని అనుకున్నారు.

Ashwin : ధ‌ర్మ‌శాల‌లో సెంచ‌రీ కొట్ట‌బోతున్న అశ్విన్‌, బెయిర్ స్టో.. అరుదైన ఘ‌ట్టం

అయితే.. రాహుల్ ఇంకా కోలుకోలేద‌ని బీసీసీఐ వెల్ల‌డించ‌డంతో సోష‌ల్ మీడియాలో అత‌డిపై ట్రోలింగ్ మొద‌లైంది. ఎన్‌సీఏలో అత‌డి అద్దె ఖ‌ర్చును ఆదా చేసుకోవ‌డానికి హార్దిక్ పాండ్య‌, దీప‌క్ చాహ‌ర్‌ల‌తో క‌లిసి ఒక ప్లాట్‌ను కొనుక్కోవాల‌ని అంటున్నారు. గ‌త కొంత‌కాలంగా కేఎల్ రాహుల్ గాయాల‌తో సావాసం చేస్తున్నాడు. జ‌ట్టులోకి వ‌స్తూ పోతూ ఉన్నాడు. దీనిపైనే నెటిజ‌న్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు.