Virat Kohli: కోచ్‌ను విరాట్ కోహ్లి అలా మోసం చేసేవాడట.. ఆసక్తికర విషయాలను చెప్పిన చిన్ననాటి ఫ్రెండ్
చిన్నతనంలో కోహ్లీ చాలా తుంటరిగా ఉండేవాడని, కోచ్‌ను చాలా తెలివిగా మోసం చేసేవాడని అతడి చిన్న నాటి స్నేహితుడు షాల్‌సోంధీ చెప్పాడు.

Virat Kohli’s friend narrates funny tale about cricketer’s naughty side
Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికి తెలిసిందే. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు ఆడుతున్న కోహ్లి గురించి అతడి చిన్న నాటి స్నేహితుడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చిన్నతనంలో కోహ్లీ చాలా తుంటరిగా ఉండేవాడని, కోచ్‌ను చాలా తెలివిగా మోసం చేసేవాడని చెప్పాడు.
ఆర్‌సీబీ యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మతో కలిసి షాల్‌సోంధీ పలు విషయాలను వెల్లడించాడు. విరాట్ కోహ్లి తన చిన్నతనంలో కోచ్ రాజ్‌కుమార్ శర్మ దగ్గర శిక్షణ తీసుకునేవాడు. అదే సమయంలో కోహ్లితో పాటు షాల్ సోంధీ కూడా రాజ్‌కుమార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. తాను కోచింగ్ ఇచ్చే సమయంలో ప్రతీ ఆదివారం చిన్నారులను పరిగెత్తించేవాడినని, పశ్చిమ విహార్ నుండి దాదాపు ఐదు లేదా ఆరు కిలోమీటర్లు పరిగెత్తెలా చూసేవాడినని కోచ్ రాజ్‌కుమార్ శర్మ చెప్పాడు. ఆ సమయంలో కోహ్లీ చాలా తుంటరి పిల్లవాడని, ఎల్లప్పుడూ అతడిపై ఓ కన్నేసి ఉంచాల్సి వచ్చేదన్నాడు.
Virat Kohli: గంభీర్‌తో గొడవ.. మరుసటి రోజు భార్యతో కలిసి విరాట్ ఏం చేశాడంటే..?
షాల్ సోంధీ కల్పించుకుని ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. పరిగెత్తే సమయంలో కోచ్ రాజ్‌కుమార్ శర్మను కోహ్లి ఎలా మోసం చేసేవాడో చెప్పాడు. మేము అందరం పరిగెడుతూ ఉండేవాళ్లం. అయితే కోహ్లీ వెనుక పడినప్పుడు మాత్రం అటుగా వెలుతున్నసైకిల్ పై వెళ్లే వారిని ఆపేవాడు.
‘భయ్యా ఆగే తక్ చోడ్ దో’ అంటూ వారిని లిఫ్ట్ అడిగేవాడు. సైకిల్ ఎక్కి ఎంచక్కా అందరి కన్నా ముందు పరుగు పెడుతున్న వారిని దాటిన తరువాత ఆపి దిగేవాడన్నాడు. “మేము పెరిగెడుతున్నామా లేదా చూసేందుకు మధ్యలో కోచ్ వచ్చేవాడు. అందరి కన్నా ముందు కోహ్లి పరిగెత్తడం చూసి అతడిని మెచ్చుకునే వాడు. మేమందం నోరెళ్లబెట్టేవాళ్లం .”అని షాల్‌సోంధీ చెప్పాడు.
కోహ్లి తాను ఇద్దరం మంచి ఆహార ప్రియుళమని సోంధీ తెలిపాడు. ప్రతి రోజు కోచింగ్ ముగిసిన తరువాత చెనీస్ బండి వద్దకు వెళ్లి పుడ్‌ను తినేవాళ్లమన్నాడు. ఇక కోహ్లి ఆటను చూసి అతడు తప్పకుండా భవిష్యత్తులో గొప్ప ఆటగాడు అవుతాడని తాను బావించినట్లు తెలిపాడు. అందుకు ఓ ఊదాహరణను చెప్పాడు.
“ఓ సారి స్టేట్ మ్యాచ్ ఆడుతున్నాం. 190 పరుగులతో విరాట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకో వైపు వికెట్లు పడుతున్నాయి. అదే సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. అప్పుడు విరాట్ నా వద్దకు వచ్చి నువ్వు క్రీజులో ఔట్ కాకుండా నిలబడు. మిగిలిన పనిని నేను చూసుకుంటా.” అని అన్నాడు. చూస్తుండగానే అతడు 250 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఆ సమయంలో విరాట్ ను చూసి ఖచ్చితంగా గొప్ప ఆటగాడు అవుతాడని బావించినట్లు ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు సోంధీ.
Virat Kohli : గంభీర్‌తో గొడవపై స్పందించిన కోహ్లీ..
ప్రస్తుతం ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి తొమ్మిది మ్యాచ్‌లలో 137.88 స్ట్రైక్ రేట్‌తో ఐదు అర్ధ సెంచరీలతో 364 పరుగులు చేశాడు.