విశాఖలో ఐపీఎల్ మ్యాచులు.. 24 నుంచి టికెట్ల అమ్మకాలు..

పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయి.

విశాఖలో ఐపీఎల్ మ్యాచులు.. 24 నుంచి టికెట్ల అమ్మకాలు..

విశాఖలో ఈ నెల 31, ఏప్రిల్‌ 3న ఐపీఎల్‌ మ్యాచ్‌‌లు జరగనున్నాయి. ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్‌ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం 24వ తేదీ నుంచి టికెట్లు కొనుక్కోవచ్చు.

అలాగే, ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టికెట్లు కొనుక్కునే అవకాశం కల్పించారు. పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరుగుతాయి. టికెట్ల ధరలు రూ.7,500, రూ.5,000, రూ.3,500, రూ.3,000, రూ.2,500, రూ.2,000, రూ.1,500, రూ.1,000గా ఉంటాయి.

ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2024 : ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ