Champions Trophy 2025 : కోతులు కూడా అంతగనం తినవు.. మా ఆటగాళ్లు మాత్రం.. వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు..
పాకిస్తాన్ జట్టు పై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

Wasim trolls Pak players Even monkeys dont eat that many bananas
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై ఆ దేశ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు చాలా కోపంగా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ ఓడిపోవడం వారి కోపానికి ఓ కారణం కాగా.. గ్రూప్ దశలో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించడం అతి పెద్ద కారణం. ప్రస్తుతం పాక్ జట్టు చాలా అధ్వానంగా ఉందని మాజీ ఆటగాళ్లు దయ్యబట్టారు.
చివరి సారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను పాక్ ఓడించింది. ఆ తరువాత ఇరు జట్ల మధ్య జరిగిన అన్ని వన్డే మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో తాజా ఓటమి తరువాత పాక్ జట్టు పై వసీం అక్రమ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఆహారం విషయంలో పాక్ ఆటగాళ్లను కూడా తప్పుపట్టాడు.
Sachin Tendulkar: వరుస బౌండరీలతో చెలరేగిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్.. గూస్‌బమ్స్ గ్యారెంటీ
‘మ్యాచ్‌లో అది ఒకటవ లేదా రెండో డ్రింక్స్ బ్రేక్ అని అనుకుంటా. ఆటగాళ్ల కోసం అరటి పండ్లతో కూడిన ప్లేట్ వచ్చింది. కోతులు కూడా అంతగా అరటి పండ్లు తినవు. అది వారు తినే పద్దతి. అదే గనుక కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ ఉండి ఉంటే.. అతడు కొట్టి ఉండేవాడు.’ అని అక్రమ్ మ్యాచ్ తరువాత జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నాడు.
ప్రస్తుతం క్రికెట్‌లో ఆట వేగం చాలా పెరిగింది. అయినప్పటికి పాక్ జట్టు ఇంకా పాత కాలపు పద్దతిలోనూ ఆడుతున్నారంటూ అక్రమ్ మండిపడ్డాడు. ఇక ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నాడు. నిర్భయంగా ఆడే క్రికెటర్లతో పాటు యువ రక్తాన్ని జట్టులోకి తీసుకురావాలి అప్పడే జట్టు బాగుపడుతుంది. ఇందుకోసం ప్రస్తుత జట్టులో ఐదు నుంచి ఆరు మార్పులు చేయాల్సి ఉందన్నాడు.
“మీరు రాబోయే ఆరు నెలలు ఓడిపోతూనే ఉంటారు. అయినా గానీ ఫర్వాలేదు. అయితే.. ఇప్పటి నుండే 2026 టీ20 ప్రపంచకప్ కోసం జట్టును నిర్మించండి అని అక్రమ్ పీసీబీకి సూచించాడు. ప్రస్తుత పాక్ బౌలర్లు వికెట్లు తీయడంలో ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అక్రమ్ వివరించాడు. గత ఐదు వన్డేల్లో పాక్ బౌలర్లు 60 సగటుతో 24 వికెట్లు తీశారు. ఒమన్, అమెరికాల సగటు కూడా మా కంటే తక్కువగా ఉంది. వన్డేలు ఆడుతున్న 14 జట్లలో పాక్ బౌలింగ్ సగటు రెండో అతి చెత్తగా ఉంది. అని అక్రమ్ చెప్పాడు.