Sachin Tendulkar: వరుస బౌండరీలతో చెలరేగిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ

సచిన్ టెండూల్కర్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. 51ఏళ్ల వయస్సులోనూ ఏమాత్రం తగ్గేదే అన్నట్లుగా తన బ్యాటింగ్ కొనసాగింది.

Sachin Tendulkar: వరుస బౌండరీలతో చెలరేగిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ

Sachin Tendulkar

Updated On : February 26, 2025 / 9:56 AM IST

Sachin Tendulkar: క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ను ఇష్టపడని క్రికెట్ అభిమానులు ఉండరు. అద్భుతమైన షాట్లతో స్టేడియం నలువైపుల బంతిని తరలించగలిగే సత్తాకలిగిన బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ ది మొదటి స్థానమే. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించక ముందు ఇండియా అంటే సచిన్.. సచిన్ అంటే ఇండియా అనేలా క్రికెట్ ఉండేది. సచిన్ క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతక్కుపోయేవారు. సచిన్ అవుట్ అయితే చాలు ఇండియాపై మ్యాచ్ గెలిచినట్లేనని ప్రత్యర్థి జట్టు భావించే పరిస్థితి ఉండేది. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు కన్నీళ్లు పెట్టుకోని క్రికెట్ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. చాన్నాళ్ల తరువాత సచిన్ బ్యాటింగ్ చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు దక్కింది.

Also Read: Champions Trophy: జాక్‌పాట్ కొట్టిన ఇంగ్లాండ్ జట్టు.. ఆఫ్గానిస్థాన్‌కు కూడా సెమీస్‌కు వెళ్లే అవకాశం.. కానీ..

సచిన్ టెండూల్కర్ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. 51ఏళ్ల వయస్సులోనూ ఏమాత్రం తగ్గేదే అన్నట్లుగా తన బ్యాటింగ్ కొనసాగింది. తాజాగా ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ టీ20లో సచిన్‌ టెండూల్కర్‌ ఇండియా మాస్టర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మంగళవారం రాత్రి నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఇంగ్లాండ్ మాస్టర్స్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. వరుసగా 6, 4, 4 కొట్టి తన ఫ్యాన్స్ కు కనువిందు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Champions Trophy: బంగ్లాపై న్యూజిలాండ్‌ గెలవడంతో భారత్‌, పాక్‌ పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలుసా? నెక్స్ట్‌ ఏంటి? 

సచిన్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ జట్టు తొమ్మి వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇండియా మాస్టర్స్ జట్టు బ్యాటర్లు బరిలోకి దిగారు. సచిన్ టెండూల్కర్ 21 బంతుల్లోనే 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన సచిన్.. ఐదు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. గుర్ కీరత్ (నాటౌట్) 35 బంతుల్లో 63, యువరాజ్ (నాటౌట్) 14 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో 11.4 ఓవర్లలోనే ఇండియా మాస్టర్స్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. అయితే, సచిన్ బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.