Champions Trophy: జాక్‌పాట్ కొట్టిన ఇంగ్లాండ్ జట్టు.. ఆఫ్గానిస్థాన్‌కు కూడా సెమీస్‌కు వెళ్లే అవకాశం.. కానీ..

ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్ -బి నుంచి సెమీఫైనల్ కు చేరే రెండు జట్లు ఏవనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Champions Trophy: జాక్‌పాట్ కొట్టిన ఇంగ్లాండ్ జట్టు.. ఆఫ్గానిస్థాన్‌కు కూడా సెమీస్‌కు వెళ్లే అవకాశం.. కానీ..

Champions Trophy 2025

Updated On : February 26, 2025 / 7:30 AM IST

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్ -బి నుంచి సెమీఫైనల్ కు చేరే రెండు జట్లు ఏవనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ -ఏ నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. గ్రూప్ -బిలో మాత్రం క్లారిటీ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు జాక్ పాట్ కొట్టినట్లయింది. ఆఫ్గానిస్థాన్ జట్టుకు కూడా సెమీస్ కు చేరేందుకు అవకాశం దక్కినట్లయింది.

 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ వర్షార్పణం కావడంతో సెమీ ఫైనల్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్ రద్దు కారణంగా దక్షిణాఫ్రికా, ఆసీస్ జట్లకు చెరో పాయింట్ దక్కింది. దీంతో రెండు జట్లు మూడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా జట్టు రన్ రేట్ లో మెరుగ్గా ఉండటంతో మొదటి స్థానంలో ఉంది.

 

ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ ఆడి ఓడిపోయింది. ఆఫ్గానిస్థాన్ జట్టు కూడా టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడి ఓడిపోయింది. దీంతో రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. అయితే, దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ డ్రా కావడంతో సెమీస్ కు వెళ్లేందుకు ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్ జట్లకు అవకాశం దక్కినట్లయింది. అయితే, బుధవారం ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారికి సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.

 

ఆఫ్గానిస్థాన్ తో బుధవారం (ఫిబ్రవరి 26) జరగనున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి.. మార్చి1న దక్షిణాఫ్రికా జట్టుపై కూడా గెలిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రెండు మ్యాచ్ లలోనూ ఇంగ్లాండ్ జట్టు ఓడిపోతే సెమీస్ అవకాశాలు కోల్పోతుంది.

 

ప్రస్తుతం గ్రూప్-బిలో సమీకరణాల ప్రకారం.. ఆఫ్గానిస్థాన్ జట్టుకు కూడా సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఇంగ్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధించడంతోపాటు.. శుక్రవారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధించగలిగితే ఆఫ్గానిస్థాన్ జట్టు నాలుగు పాయింట్లతో సెమీస్ కు చేరే అవకాశం ఉంది.

 

ఆస్ట్రేలియా జట్టు రెండు మ్యాచ్ లు ఆడి మూడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ శుక్రవారం ఆప్గానిస్థాన్ జట్టుతో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ఐదు పాయింట్లతో సెమీస్ కు చేరుతుంది. దక్షిణాఫ్రికా జట్టు తన చివరి మ్యాచ్ ను ఇంగ్లాండ్ జట్టు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా సైతం ఐదు పాయింట్లతో సెమీస్ కు చేరుతుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా గ్రూప్-బిలో మొదటి స్థానంలో నిలిచే జట్టును నిర్ణయిస్తారు.

ICC Champions Trophy 2025 Table

ICC Champions Trophy 2025 Table