WCL 2025 : సెమీస్‌లో తలపడనున్న భారత్, పాక్.. వైదొలిగిన స్పాన్సర్..!
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్‌లో సెమీస్ బెర్తులు ఖాయం అయ్యాయి.

Indian sponsor pulls out of WCL clash against PAK
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్‌లో సెమీస్ బెర్తులు ఖాయం అయ్యాయి. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఓ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనుండగా.. మరో సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడాల్సి ఉంది.
అయితే.. లీగ్ దశలో భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడంతోనే అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండు జట్లు సెమీస్‌కు చేరడంతో ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
India vs Pakistan – WCL Semi-Final
We applaud Team India @India_Champions for their outstanding performance in the World Championship of Legends, you’ve made the nation proud.
However, the upcoming semi-final against Pakistan is not just another game, Terror and cricket cannot…
— Nishant Pitti (@nishantpitti) July 30, 2025
షెడ్యూల్ ప్రకారం సెమీస్ మ్యాచ్ గురువారం (జూలై 31)న బర్మింగ్‌హామ్ వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టోర్నీ స్పాన్సర్ అయిన ఈజ్‌మైట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌కు తాము స్పాన్సర్‌గా వ్యవహరింబోమని తెలిపింది.
సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. “డబ్ల్యూసీఎల్ 2025 సీజన్‌లో భారత జట్టు సెమీస్ చేరినందుకు శుభాకాంక్షలు. మీరంతా దేశం గర్వపడేలా చేశారు. సెమీస్‌లో పాక్‌తో ఆడాల్సి ఉంది. అయితే.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేం భారత్ వెంటే ఉంటాం. దేశ ప్రజల మనోభావాలను మేం అర్థం చేసుకున్నాం. పరిస్థితులు సద్దుమణిగేవరకూ మేం ఇలాంటి మ్యాచ్‌లకు స్పాన్సర్ చేయబోం. కొన్ని విషయాలు ఆటలకే ఎక్కువ. ఎప్పుడైనా సరే దేశమే ముఖ్యం. జై హింద్.” అని నిశాంత్ తెలిపారు.
ENG vs IND : భారత్‌తో ఐదో టెస్టు.. వరల్డ్ రికార్డు సృష్టించేందుకు అతి చేరువలో జోరూట్..
సెమీస్‌లో భారత్ ఆడకపోతే ఏం జరుగుతుంది?
యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్ డబ్ల్యూసీఎల్‌లో సెమీస్‌కు చేరుకుంది. ఒకవేళ భారత జట్టు సెమీస్‌లో పాక్ తో ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే అప్పుడు పాక్ ఫైనల్‌కు వెలుతుంది.